రెండు ప్రాంతాల్లో CM పర్యటన

ABN , First Publish Date - 2021-12-09T17:21:58+05:30 IST

ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న అంబత్తూరు, పాడికుప్పం ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం మధ్యాహ్నం అధికారులతో కలిసి పర్యటించారు. అంబత్తూరులో ఒకేరోజు 20 సెం.మీల వర్షపాతం నమోదైంది. అక్కడి

రెండు ప్రాంతాల్లో CM పర్యటన

                   - వర్షబాధిత ప్రాంతాల పరిశీలన


చెన్నై: ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న అంబత్తూరు, పాడికుప్పం ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం మధ్యాహ్నం  అధికారులతో కలిసి పర్యటించారు. అంబత్తూరులో ఒకేరోజు 20 సెం.మీల వర్షపాతం నమోదైంది. అక్కడి పారిశ్రామికవాడలోని పలు కర్మాగారాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో పాడికుప్పం రైల్‌నగర్‌ వద్ద వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అక్కడి ఫ్లైఓవర్‌ నుంచి కొరట్టూరు చెరువు ప్రాంతాన్ని సందర్శించారు. కొరట్టూరు చెరువు కాల్వను పరిశీలించారు. ఆ సందర్భంగా స్థానికులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టాలిన్‌తోపాటు మంత్రి పీకే శేఖర్‌బాబు, అంబత్తూరు శాసనసభ్యుడు జోసెఫ్‌ శ్యామ్‌వేల్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీ్‌ప సింగ్‌ బేదీ తదితరులు పర్యటించారు.

దివ్యాంగులకు 


ఉచిత వివాహ పథకం ప్రారంభం

సచివాలయంలో ఏర్పాటైన మరొక కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ఆలయాలకు చెందిన కళ్యాణమండపాలలో దివ్యాంగులకు ఉచిత వివాహాలు జరిపే పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం ట్రిప్లికేన్‌ పార్థసారథి ఆలయంలో వివాహం చేసుకోనున్న దివ్యాంగ జంటకు ఉచిత వివాహం జరపాలనే ఉత్తర్వును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పీకే శేఖర్‌బాబు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ చంద్రమోహన్‌, హిందూ దేవాదాయ శాఖ కమిషనర్‌ జే కుమారగురుబరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T17:21:58+05:30 IST