Cm ఇంటికి బాంబు బెదిరింపు

ABN , First Publish Date - 2022-05-20T15:04:32+05:30 IST

ముఖ్యమంత్రి ఇంటిని బాంబులతో పేల్చి వేస్తామంటూ బెదిరించిన తిరునల్వేలి జిల్లాకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎగ్మూర్‌ పోలీస్‌ కంట్రోల్‌

Cm ఇంటికి బాంబు బెదిరింపు

పెరంబూర్‌(చెన్నై): ముఖ్యమంత్రి ఇంటిని బాంబులతో పేల్చి వేస్తామంటూ బెదిరించిన తిరునల్వేలి జిల్లాకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎగ్మూర్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు బుధవారం ఫోన్‌ చేసిన అజ్ఞాత వ్యక్తి, సీఎం ఇంటి వద్ద బాంబులు పెట్టినట్లు, కొద్దిసేపట్లో అవి పేలనున్నాయని, చేతనైతే అడ్డుకోవాలని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. దీంతో పోలీసులు, బాండ్‌ స్క్వాడ్‌తో హూటాహుటిన సీఎం ఇల్లు, కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేపట్టి అది ఫేక్‌ కాల్‌ అని నిర్ధారించారు. అదనంగా సైబర్‌ క్రైం విభాగం సహాయంతో ఆ బెదిరింపు తిరునల్వేలి జిల్లా సుద్దమిల్లి గ్రామానికి చెందిన తామరైకన్నన్‌ చేసినట్లు నిర్ధారించి అరెస్ట్‌ చేశారు. గంజాయి మత్తులో అతడు ఈ బెదిరింపునకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Updated Date - 2022-05-20T15:04:32+05:30 IST