వర్షబాధిత ప్రాంతాల్లో సహాయాల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-05T14:40:24+05:30 IST

కాంచీపురం జిల్లాలోని వర్షబాధిత ప్రాంతాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం ఉదయం పర్యటించారు. స్థానిక పోరూరు, మాంగాడు, అయ్యప్పన్‌ తాంగళ్‌, ధనలక్ష్మినగర్‌ ప్రాంతాలను అధికారులతో

వర్షబాధిత ప్రాంతాల్లో సహాయాల పంపిణీ

                     - కాంచీపురంలో సీఎం Stalin 


చెన్నై: కాంచీపురం జిల్లాలోని వర్షబాధిత ప్రాంతాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం ఉదయం పర్యటించారు. స్థానిక పోరూరు, మాంగాడు, అయ్యప్పన్‌ తాంగళ్‌, ధనలక్ష్మినగర్‌ ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ ప్రాంతాల్లోని వర్షపునీటిని తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. పోరూరు చెరువు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఆ చెరువులో కలుస్తున్న వ్యర్థ్థాలను తొలగించాలని ఆయన స్థానిక అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత మౌలివాక్కం, మాంగాడు ప్రాంతాల్లో పర్యటించారు. అయ్యప్పన్‌ తాంగల్‌ భరణిపుత్తూరు వద్ద వర్షబాధితులకు నిత్యావసర వస్తువుల్నీ, ఆహారాన్నీ పంపిణీ చేశారు. ధనలక్ష్మినగర్‌ ప్రాంతంలో ఇళ్ళ చుట్టూ ప్రవహిస్తున్న వర్షపునీటిని పరిశీలించారు. స్థానికుల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టాలిన్‌తోపాటు మంత్రి దామో అన్బరసన్‌, ఎంపీ టీఆర్‌ బాలు, టాస్మాక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వర్షబాధిత ప్రాంతాల పరిశీలకుడు ఎల్‌ సుబ్రమణియన్‌, కాంచీపురం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం. ఆరతి తదితరులు పర్యటించారు.

Updated Date - 2021-12-05T14:40:24+05:30 IST