నేడు ముఖ్యమంత్రి రాక

ABN , First Publish Date - 2022-06-27T06:47:18+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం నగరానికి రానున్నారు.

నేడు ముఖ్యమంత్రి రాక

విశాఖపట్నం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి):


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం నగరానికి రానున్నారు. ఉదయం 10.15 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, ఇక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో శ్రీకాకుళం వెళతారు. అక్కడ అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొని, తల్లుల ఖాతాలకు సొమ్ము విడుదల చేసిన అనంతరం, బహిరంగసభలో ప్రసంగిస్తారు. తిరిగి 1.35 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరం వెళతారు. 


ఆనంద్‌కే పగ్గాలు 

పశ్చిమ వైసీపీ సమన్వయకర్తగా ఆడారి ఆనంద్‌

ఉత్తర్వులు జారీచేసిన పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి


విశాఖపట్నం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ సమన్వయకర్తగా ఆడారి ఆనంద్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ సమన్వయకర్తగా  పనిచేసిన మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్‌ సీఐబీ కేసులతోపాటు వ్యక్తిగత సమస్యల కారణంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో  అతనిస్థానంలో డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ను నియమించాలని పార్టీ భావించింది. ఈ క్రమంలో గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమానికి సమన్వయకర్తగా నియమించింది. దీనిపై నియోజకవర్గంలోని పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయడంతో పాటు అతనిని మార్చేవరకూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని అల్టిమేటం జారీచేయడంతో పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్‌ పేరును తెరపైకి తెచ్చింది. అతను సముఖత వ్యక్తంచేయకపోవడంతో ఆడారి ఆనంద్‌ పేరు ఖరారు చేశారు. ప్రస్తుత సమన్వయకర్త మళ్ల విజయ్‌ప్రసాద్‌ను పిలిచి వివరించగా, తన భార్య లేదా కుమార్తెను  నియమించాలని ఆయన కోరినప్పటికీ అధిష్ఠానం ఆనంద్‌కుమార్‌ వైపు మొగ్గుచూపింది. 



Updated Date - 2022-06-27T06:47:18+05:30 IST