సీఎం మాట తప్పారు...

ABN , First Publish Date - 2021-01-24T05:56:24+05:30 IST

అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందుకు ముఖ్యమంత్రి జగన్‌ ఉద్యోగ, ఉపాద్యాయుల కు ఇచ్చిన మాటను తప్పారని యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు బోడెల విజయకుమార్‌ అన్నారు.

సీఎం మాట తప్పారు...
ప్రమాణం చేస్తున్న యూటీఎఫ్‌ కార్యవర్గం

యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు విజయకుమార్‌

సాలూరు రూరల్‌ : అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటను తప్పారని యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు బోడెల విజయకుమార్‌ అన్నారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పాదయాత్రలో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి... ప్రస్తుతం వాటిని విస్మరించారని చెప్పారు. కాగా మండల నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించినట్టు తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా సింగారపు సింహాచలం, అధ్యక్షుడుగా కె.జానకీరావు, సహధ్యక్షుడిగా అనకాపల్లి గణేష్‌, సీహెచ్‌ లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా అల్లు మన్మధరావు, కోశాధికారిగా ఎస్‌.కృష్ణ, వివిధ హోదాల్లో ఏవీ రామారావు, సీతయ్య, చింతగడ జగదీష్‌, మేరీగోల్డ్‌ తదితరులు ఎన్నికవ్వగా... వీరితో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్రనేత విజయగౌరీ, రాజామణి తదితరులు పాల్గొన్నారు. కాగా బదిలీ అయిన పలువురు ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సన్మానించారు. 

Updated Date - 2021-01-24T05:56:24+05:30 IST