రాజీనామాపై అధిష్ఠానానికి షరతులు విధించిన yediyurappa

ABN , First Publish Date - 2021-07-17T19:06:07+05:30 IST

కర్నాటక రాజకీయాలపై మళ్లీ స్పాట్ లైట్ పడింది. ముఖ్యమంత్రి యడియూరప్ప శుక్రవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

రాజీనామాపై అధిష్ఠానానికి షరతులు విధించిన yediyurappa

న్యూఢిల్లీ : కర్నాటక రాజకీయాలపై మళ్లీ స్పాట్ లైట్ పడింది. ముఖ్యమంత్రి యడియూరప్ప శుక్రవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా భేటీ కాబోతున్నారు. అయితే ప్రధాని మోదీతో కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడామని యడియూరప్ప తెలిపారు. ‘‘మీరు సూచించిన విధంగా నడుచుకుంటాను. అందుకు నేను సిద్ధమే. బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడే నడుచుకుంటాను. ఒకవేళ మీరు రాజీనామా చేయమంటే చేసేస్తాను’’ అని యడియూరప్ప ప్రధాని మోదీతో స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా బీజేపీ అధిష్ఠానం ముందు యడియూరప్ప కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తన కుమారులిద్దరికీ జాతీయ రాజకీయాల్లో కీలకమైన పదవులు ఇచ్చి, కీలకమైన పాత్ర పోషించేలా పార్టీ సహకరిస్తే, తాను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగానే ఉన్నానని యడియూరప్ప అధిష్ఠానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే యడియూరప్ప మాత్రం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, తనను పదవి నుంచి వైదొలగమని ఎవరూ కోరలేదని ప్రకటించారు. ‘‘రాజీనామాకు సంబంధించిన వార్తలన్నీ వదంతులే. రాజీనామా చేసే ప్రసక్తే లేదు. కర్నాటక ప్రాజెక్టులపై చర్చించేందుకే ఢిల్లీకి వచ్చా. వచ్చే నెలలో కూడా మరోసారి ఢిల్లీకి వస్తా’’ అని యడియూరప్ప ప్రకటించారు. 


Updated Date - 2021-07-17T19:06:07+05:30 IST