నాడు జగన్.. నేడు చంద్రబాబు.. ప్రతికారమేనా?

ABN , First Publish Date - 2021-03-02T00:48:55+05:30 IST

నాడు జగన్.. నేడు చంద్రబాబు.. ప్రతికారమేనా?

నాడు జగన్.. నేడు చంద్రబాబు.. ప్రతికారమేనా?

అమరావతి/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి రేణిగుంట ఎయిర్‌పోర్టుపై పడింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్య అధికారి ఇతరుల ఫోన్లను పోలీసులు బలవంతంగా లాక్కున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వెళుతున్న తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ... చంద్రబాబు ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనే బైఠాయించారు. అకారణంగా తనను అడ్డుకోవడంపై జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు ఎస్పీలతో మాట్లాడటానికి వెళతానని చెప్పినా పోలీసులు ఆయనను బయటకు వెళ్లనివ్వలేదు. దీంతో తనకు అనుమతి ఇచ్చే వరకు విమానాశ్రయంలోనే తన నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. 


రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబును అడ్డుకోవడంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనను వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఆనాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఎపిసోడ్‌తో అటు వైసీపీ మద్దతుదారులు, ఇటు టీడీపీ మద్దతుదారులు కూడా పోల్చుతుండడం విశేషం. ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు.. తమ నేతను ఇలాగే అడ్డకున్నారు కదా అని వైసీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ప్రతిపక్షనేతను అడ్డుకుంటే ప్రశ్నించని వాళ్లు ఇప్పుడెలా మాట్లాడతున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనికి టీడీపీ నుంచి అంతే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. 


ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘‘నాడు విశాఖలో జగన్.. నేడు తిరుపతిలో చంద్రబాబు.. ప్రతికారమేనా?. పారిశ్రామిక సదస్సును అల్లరిచేసేందుకు నాటి కుట్ర నిజంకాదా?. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు వాస్తవం కాదా?. అప్రజాస్వామిక చర్యలను ప్రజాస్వామికంగా నిరసించే స్వేచ్ఛ ఏపీకి లేదా?. చంద్రబాబు స్థాయి నేతను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-03-02T00:48:55+05:30 IST