వలంటీర్లకు వైఎస్ జగన్ సెల్యూట్..

ABN , First Publish Date - 2021-04-12T19:29:31+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో బాగా పనిచేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్కరించారు.

వలంటీర్లకు వైఎస్ జగన్ సెల్యూట్..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో బాగా పనిచేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్కరించారు. సోమవారం నాడు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకిలో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా.. వలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను జగన్ ప్రదానం చేశారు. వలంటీర్లకు అభినందనలు తెలిపిన వైఎస్ జగన్.. ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు.


దేశం మొత్తం మనవైపు చూసేలా...

వలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు మట్లాడుతున్నాయి. పండ్లు ఉన్న చెట్లు మీదనే రాళ్లు పడతాయి. నిజాయితీగా పనిచేస్తే ఎవరికీ బయపడాల్సిన పని లేదు. వారి పాపాన వారే పోతారు. మీరు చేస్తున్నది సేవా, ఉద్యోగం కాదు. పేదల దివేనే మనకు ఆస్తి అని వలంటీర్‌లు గుర్తుంచుకోవాలి. వలంటీర్ వ్యవస్థ స్థాపించిన 20 నెలలో దేశం మొత్తం మనవైపు చూసేలా పనిచేస్తున్నారు. వలంటీర్ నిస్వార్థంగా, ఎటువంటి వివక్ష లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నారుఅని జగన్ వెల్లడించారు.


వలంటీర్లకు సెల్యూట్..

రాష్ట్రంలోని వలంటీర్లు అందరికి సెల్యూట్ చేస్తున్నాను. 97 శాతం మంది వలంటీర్లు వయసు 35 సంవత్సరాల్లోపు 53 శాతం మహిళలు, 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే. పెన్షన్లు పంపిణీ చేస్తున్న తీరును చూస్తే వలంటీర్ల మంచి మనసు అర్ధమవుతుంది. ఇప్పటికే 32 సేవలకు వలంటీర్లు పని చేస్తున్నారు. కోవిడ్ సమయంలో వలంటీర్ పాత్ర చాలా పెద్దది. 2.22 లక్షల మంది వలంటీర్‌లకు నేడు సత్కారం చేస్తున్నాం. 2.18 లక్షల మందికి సేవ మిత్ర అందిస్తున్నాం. 4000 మందికి సేవా రత్న అందిస్తున్నాం. 875 మందికి సేవ వజ్ర అందిస్తున్నాం. మొత్తం 241 కోట్ల రూపాయలు వీరికి ఖర్చు చేస్తున్నాం. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి జిల్లాలో రోజుకు ఒక నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీలు ఈ సత్కారంలో పాల్గొంటారు. మూడు ప్రాంతాల్లో నేను ఒక రోజు హాజరవుతాను. ఉత్తరాంధ్ర, రాయలసీమలో కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతాను అని సభా వేదికగా జగన్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-04-12T19:29:31+05:30 IST