రెండు వారాల్లో రెండోసారి పెరిగిన CNG ధర

ABN , First Publish Date - 2022-05-21T13:28:06+05:30 IST

దేశంలో శనివారం మరోసారి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు పెరిగాయి....

రెండు వారాల్లో రెండోసారి పెరిగిన CNG ధర

న్యూఢిల్లీ: దేశంలో శనివారం మరోసారి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు పెరిగాయి.శనివారం ఉదయం 6 గంటల నుంచి సీఎన్‌జీ ధర కిలోకు 2 రూపాయలు పెరిగింది.ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను కిలోకు 2 రూపాయలు పెంచింది.ఢిల్లీలో ఇప్పుడు సీఎన్‌జీ ధర కిలోకు రూ.75.61గా ఉంది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కిలోకు 78.17 రూపాయలకు పెరిగింది. సీఎన్‌జీ ధర రెండు వారాల్లో రెండోసారి పెరిగింది. సీఎన్‌జీ రేట్ల పెంపు కారణంగా ఢిల్లీలోని ఆటో, టాక్సీ, మినీ బస్సు డ్రైవర్ల యూనియన్లు గత నెలలో సమ్మెకు దిగాయి. సీఎన్‌జీ ధరల పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది.


Updated Date - 2022-05-21T13:28:06+05:30 IST