బొగ్గు కొరత కేంద్ర ప్రభుత్వం సృష్టి

ABN , First Publish Date - 2021-10-17T06:21:09+05:30 IST

బొగ్గు కొరత కేంద్ర ప్రభుత్వం సృష్టి అని, కోల్‌ ఇండియాను ప్రవేటీకరించే చర్యల్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఎత్తుగడని ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్‌ కె.నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

బొగ్గు కొరత కేంద్ర ప్రభుత్వం సృష్టి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింగరావు

కోల్‌ ఇండియా ప్రైవేటీకరణ ఎత్తుగడల్లో భాగం

విద్యుత్‌ సంక్షోభంపై సదస్సులో పలువురు వక్తలు

విశాఖపట్నం, అక్టోబరు 16: బొగ్గు కొరత కేంద్ర ప్రభుత్వం సృష్టి అని,  కోల్‌ ఇండియాను ప్రవేటీకరించే చర్యల్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఎత్తుగడని ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్‌ కె.నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.  సీపీఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు అధ్యక్షతన ‘బొగ్గు కొరత-విద్యుత్‌ సంక్షో భం’ అనే అంశంపై పౌరగ్రంథాలయంలో శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు జూమ్‌ యాప్‌ ద్వారా పాల్గొని మాట్లాడారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించక పోవడం, కోల్‌ ఇండియాకు బొగ్గు బ్లాకులు కేటాయించక పోవడం వెనుక వాటి అమ్మకాల కుట్ర దాగుతుందన్నారు.


బొగ్గు నిల్వలున్న దేశాల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్‌లో బొగ్గు కొరత ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.  విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఇ.ఎ.ఎస్‌. శర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ దూరదృష్టి లేమి ప్రస్తుత కొరతకు కారణమన్నారు. ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలను ప్రోత్స హించి ఏపీ జెన్‌కో సామర్థ్యాన్ని తగ్గి స్తూ వస్తున్నారన్నారు.


రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీలు ఒప్పం దం ప్రకారం రాష్ట్రానికి విద్యుత్‌ కేటా యించకుండా ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు అమ్ముకుం టున్నారని, అటువంటి సంస్థలకు జరిమానా విధించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోం దన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్‌.నరసింగ రావు మాట్లాడుతూ వర్షాకాలం వల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గిందని కేంద్రం ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోందన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచడం కోసం టాటా, ఆదానీలు తమ ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేసిన విషయం గుర్తు చేశారు.


బొగ్గు కొరత  సృష్టించి తద్వారా విద్యుత్‌ సంక్షోభాన్ని చూపి ధరలు పెంచడం అసలు ఉద్దేశమన్నారు. గ్యాస్‌ ఆధారిత పవర్‌ ప్లాంట్లకు గ్యాస్‌ సరఫరా చేయకుండా ఇతర రాష్ట్రాలకు అం బానీ గ్యాస్‌ తరలిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఎ.అజశర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T06:21:09+05:30 IST