సమన్వయంతో పని చేయాలి

ABN , First Publish Date - 2020-12-04T04:28:14+05:30 IST

అధికారులు గ్రామాల్లో పనిచేసేటప్పు డు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని, పనిచేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి అన్నారు.

సమన్వయంతో పని చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుదాకర్‌రెడ్డి

8 అధికారులు, ప్రజాప్రధినిధులు కలిసి పని చేయాలి

8 భూత్పూర్‌ మండల  సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌

8 అధికారుల పనితీరుపై సభ్యుల అసంతృప్తి 


భూత్పూర్‌, డిసెంబరు 3 : అధికారులు గ్రామాల్లో పనిచేసేటప్పు డు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని, పనిచేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం ఎంపీపీ డాక్టర్‌ కదిరె శేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్యు సమావేశా నికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడా రు. గ్రామాల్లో ప్రజల అవసరాలకు సంప్రదిస్తే అధికారులు స్పందిం చడం లేదని వెల్కిచర్ల సర్పంచ్‌ పద్మజక్కిరెడ్డి సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టి కాహారం పంపిణీ విషయంలో స్థానిక ప్రజాప్రధినిధులకు సంబంధం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచులు ప్రియాంకరెడ్డి, శేఖర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు సభలో ఆరోపించారు. గ్రామాల్లో సర్పంచులకు, ఎంపీటీ సీలకు సమాచారం ఇవ్వాలని అన్నారు. సీసీ రోడ్లు వేసినా బిల్లులు కావ డం లేదని పెద్ద తండా సర్పంచ్‌ లాలి ఆవేదన వ్యవక్తం చేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ స్పందిస్తూ బిల్లులు త్వరగా వచ్చేలా చూడాలని పంచాయతీరాజ్‌ శాఖ ఏఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ చెన్నకిష్టన్న, ఎంపీడీ ఓ మున్ని, సింగిల్‌విండో అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ నరేష్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు నారాయణగౌడ్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:28:14+05:30 IST