అతి పొడవైన సముద్ర తీరప్రాంతం కలిగిన దేశం!

Published: Mon, 28 Mar 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అతి పొడవైన సముద్ర తీరప్రాంతం కలిగిన దేశం!

ప్రపంచంలో రెండో అతి పెద్ద దేశం ఇది. ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న ఈ దేశ రాజధాని నగరం ఒట్టావా. ఇక ఈ దేశంలో అతి పెద్ద నగరం టొరంటో. 

  • ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఒక్కసారైనా చూడాలని అనుకునే నయాగరా ఫాల్స్‌ ఇక్కడే ఉన్నాయి. గ్రేట్‌ బేర్‌ లేక్‌, గ్రేట్‌ స్లేవ్‌ లేక్‌ అని పిలిచే రెండు అతి పెద్ద సరస్సులు ఇక్కడ చూడొచ్చు. 
  • కరెన్నీ కెనడియన్‌  డాలర్‌. జూలై 1న కెనడా డే జరుపుకొంటారు.
  • కెనడాలో ప్రవహించే అతి పొడవైన నది మెకంజీ. ఇది 4240 కి.మీ మేర ప్రవహిస్తుంది.
  • ఈ దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. జనవరి మాసంలో ఒట్టావా నగరంలో సగటును -14.4 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదవుతుంది.
  • ప్రపంచలో అతి పొడవైన సముద్ర తీరప్రాంతం కలిగిన దేశం కూడా ఇదే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అడవుల్లో 10 శాతం ఇక్కడే ఉన్నాయి. 
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.