కొబ్బరి లడ్డు

ABN , First Publish Date - 2021-10-13T17:25:38+05:30 IST

పచ్చి కొబ్బరి తురుము- ఒకటిన్నర కప్పు, నెయ్యి- స్పూను, యాలకుల పొడి- అర స్పూను, తియ్యని కండెన్స్‌డ్‌ మిల్క్‌- ముప్పావుకప్పు, ఎండు కొబ్బర- పావు కప్పు.

కొబ్బరి లడ్డు

కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము- ఒకటిన్నర కప్పు, నెయ్యి- స్పూను, యాలకుల పొడి- అర స్పూను, తియ్యని కండెన్స్‌డ్‌ మిల్క్‌- ముప్పావుకప్పు, ఎండు కొబ్బర- పావు కప్పు.


తయారుచేసే విధానం: ఓ మందపాటి పాన్‌లో నెయ్యి వేసి కాగాక కొబ్బరి తురుమును వేసి అయిదు నిమిషాల పాటు వేయించాలి. దీంట్లోనే తియ్యని కండెన్స్‌డ్‌ పాలు, యాలకులపొడిని కలిపి ఉడికించాలి. కాసేపటికి కొబ్బరంతా దగ్గరికి వస్తుంది. రెండు నిమిషాల తరవాత ఈ మిశ్రమాన్నంతా మరో గిన్నెలోకి వేసుకోవాలి. కాస్త చల్లబడ్డాక లడ్డూల్లా చేత్తో వత్తాలి. వీటిని ఎండు కొబ్బరిలో అద్దితే ఘుమఘుమలాడే కొబ్బరి లడ్డు రెడీ.

Updated Date - 2021-10-13T17:25:38+05:30 IST