కోకొనట్‌ మాక్రూన్స్‌

ABN , First Publish Date - 2021-01-03T17:51:59+05:30 IST

కొబ్బరి తురుము - ఒక కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - అర కప్పు, వెనీలా ఎక్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, ఎగ్‌వైట్స్‌ - రెండు, ఉప్పు - పావు టీస్పూన్‌, స్వీట్‌ చాక్లెట్‌ - అరకప్పు.

కోకొనట్‌ మాక్రూన్స్‌

కావలసినవి: కొబ్బరి తురుము - ఒక కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - అర కప్పు, వెనీలా ఎక్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, ఎగ్‌వైట్స్‌ - రెండు, ఉప్పు - పావు టీస్పూన్‌, స్వీట్‌ చాక్లెట్‌ - అరకప్పు.


తయారీ విధానం: ఓవెన్‌ను 325 డిగ్రీల ఫారన్‌హీట్‌కు ప్రీ హీట్‌ చేసుకోవాలి. ఒక పాత్రలో కొబ్బరి తురుము తీసుకుని అందులో కండెన్స్‌డ్‌ పాలు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి కలుపుకోవాలి. మరొక పాత్రలో ఎగ్‌వైట్స్‌ తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి మిక్సర్‌తో బాగా కలియబెట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కొబ్బరి తురుము ఉన్న పాత్రలో వేసి కలుపుకోవాలి. బేకింగ్‌ షీట్‌లో మిశ్రమాన్ని వేసి ఓవెన్‌లో ఉడికించాలి. తరువాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారిన తరువాత చాక్లెట్‌ మిశ్రమంలో డిప్‌ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. వీటిని ఫ్రిజ్‌లో పావు గంటపాటు పెట్టుకుంటే చాక్లెట్‌ గట్టిపడుతుంది. తరువాత సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-01-03T17:51:59+05:30 IST