కొబ్బరికి కళ!

ABN , First Publish Date - 2020-08-09T11:19:25+05:30 IST

జిల్లాలో కొబ్బరి మార్కెట్‌ పుంజుకుంటోంది. ఇప్పటివరకు పచ్చికొబ్బరికాయల ధర దారుణంగా పడిపోయిన తరుణంలో తాజాగా..

కొబ్బరికి కళ!

 పుంజుకుంటున్న కొబ్బరి మార్కెట్‌

 వెయ్యి పచ్చి  కొబ్బరి కాయ ధర రూ.10వేల పైనే

లాక్‌డౌన్‌ నిబంధనల ఎత్తివేతతో పెరిగిన ఎగుమతులు

వినాయకచవితి పర్వదినాల్లో పెరగనున్న వినియోగం


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొబ్బరి మార్కెట్‌ పుంజుకుంటోంది. ఇప్పటివరకు పచ్చికొబ్బరికాయల ధర దారుణంగా పడిపోయిన తరుణంలో తాజాగా వెయ్యి కాయ రూ.10వేలకు పైనే ధర పలుకుతుండడంతో కొబ్బరి రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తున్నారు. రానున్న వినాయక చవితి పర్వదినాల నేపథ్యంలో కొబ్బరి ధరల పెరుగుదలకు కారణంగా భావిస్తు న్నారు. కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తి వేయడంతో గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతులు అనూహ్యంగా పుంజుకు న్నాయి. దాంతో రేట్లు పెరుగుదలకు కారణంగా రైతులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మార్కె ట్‌ ధర మరింత పుంజుకునే పరిస్థితులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.


ఇప్పటివరకు పచ్చికాయ వెయ్యింటికి రూ.8 వేల నుంచి రూ.9 వేల మధ్య ధర పలికేది. ఇప్పుడు ఆ ధర రూ.10 వేలకు చేరింది. దీనికితోడు మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తెలంగాణ, రాజస్థాన్‌ వంటి వివిధ రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు పెరిగాయి. ఈనెల 22న గణపతి నవరాత్రులు ప్రారంభం కానుండడంతో కొబ్బరికాయల వినియోగం అధికంగా ఉంటుంది. దాంతో ఎగుమతులు పెరిగాయి. ప్రస్తుతం బహిరంగ విపణిలో ఒక కొబ్బరికాయ వచ్చి సాధారణ రకం రూ.10 నుంచి రూ.20 పలుకుతుం డగా, కాయ సైజును బట్టి నంబరువన్‌ రకం రూ.25 వరకు ధర పలుకుతోంది. కొబ్బరి బొండాం అయితే రూ.15 నుంచి రూ.20కు విక్రయిస్తున్నారు. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్‌ వర్గాల అంచనా.


జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు ప్రధానంగా అంబాజీపేట మార్కె ట్‌ నుంచి నిత్యం వందకు పైగా లారీలు వివిధ రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. నాఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు సైతం రైతుల నుంచి సరుకు కొనుగోళ్ల విష యంలో చేతులెత్తేసినప్పటికీ ప్రస్తుతం రైతులు ఆశించిన మేర మార్కెట్‌ ధర పెరిగింది. నీటికాయ, పాతముక్కుడు వెయ్యిం టికి రూ.9,500 నుంచి రూ.10వేల వరకు ధర పలుకుతుంది. కొత్త కొబ్బరి రూ.9,500, కురిడీ కొబ్బరి(పాతవి) గండేరా వెయ్యింటికి రూ.12,500, గటగటా వెయ్యింటికి రూ.8,500, కురిడీకొబ్బరి (కొత్తవి) రూ.12 వేలు, గటగటా రూ.8 వేల ధర పలుకుతున్నాయి. 

Updated Date - 2020-08-09T11:19:25+05:30 IST