కొబ్బరి బొండం ధర అదుర్స్‌

ABN , First Publish Date - 2021-05-05T06:04:02+05:30 IST

(అమలాపురం-ఆంధ్రజ్యోతి) వేసవి వచ్చిందంటేచాలు కొబ్బరి బొండాలకు మంచి గిరాకీ. కోకోనట్‌ వాటర్‌ తాగితే అలసట తీరడంతోపాటు ఆరోగ్య ప్రదా యకంగా ఉంటుంది. అటువంటి కొబ్బరి బొండం ధరలు ఇప్పుడు అదిరిపోతున్నాయి. అనారోగ్యాల బారినపడిన వారికి కొబ్బరి బొండం ఎంతో ప్రయోజకరమ

కొబ్బరి బొండం ధర అదుర్స్‌

బొండం రైతు ధర రూ.10.. 

మార్కెట్‌ రేటు రూ.20 నుంచి రూ.30 వరకు

ఇతర ప్రాంతాలకు భారీగా బొండాలు ఎగుమతులు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

వేసవి వచ్చిందంటేచాలు కొబ్బరి బొండాలకు మంచి గిరాకీ. కోకోనట్‌ వాటర్‌ తాగితే అలసట తీరడంతోపాటు ఆరోగ్య ప్రదా యకంగా ఉంటుంది. అటువంటి కొబ్బరి బొండం ధరలు ఇప్పుడు అదిరిపోతున్నాయి. అనారోగ్యాల బారినపడిన వారికి కొబ్బరి బొండం ఎంతో ప్రయోజకరమని చెబుతారు. దీంతో కొబ్బరి బొండం ధరలు ఆకాశాన్నంటాయి. కోనసీమ సహా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కొబ్బరి బొండం ఇప్పుడు సైజును బట్టి రూ.20, రూ.25, రూ.30 ధరల్లో లభిస్తోంది. అమ్మో అంత రేటా అని వినియోగదారులు కళ్లు తేలేసేలా ధర ఉంటున్నా వాడకం తప్పడం లేదు. మార్కెట్‌లో ధర అదిరిపోతున్నా రైతుకు మాత్రం రూ.10 మాత్రమే దక్కుతోంది. అయితే ఇటీవలకాలంలో కొబ్బరి పచ్చి కాయల ధర రూ.6 నుంచి రూ.8కి పడిపోవడంతో రైతులు కొబ్బరి బొండాల విక్రయం వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌ ధరకన్నా తక్కువ ఇస్తున్నా పచ్చికాయ ధరకన్నా ఇదే మేలు అనే రీతిలో సరిపెట్టుకుంటున్నారు. బొండాల ఎగుమతిదారులు తోటల్లోకి వచ్చి తాళ్ల సహాయంతో కొబ్బరి బొండాలను చెట్ల నుంచి దింపి వేలాది బొండాలను ఇతర ప్రాంతాలకు తర లించుకుపోతున్నారు. ముఖ్యంగా కోనసీమతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కొబ్బరి బొండాలు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు నిత్యం పది, పదిహేను లారీలకు పైగానే నిత్యం ఎగు మతి అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మరింత డిమాండు పెరిగిందని చెబుతున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో ఉదయం వేళల్లోనే కొబ్బరి బొండాలు దొరుకుతున్నాయి. మధ్యా హ్నం వస్తే ఎక్కడా దొరకని పరిస్థితి కూడా అమలాపురం సహా వివిధ ప్రాంతాల్లో నెలకొంది. ప్రస్తుతం కొబ్బరితోటల్లో కాయలకు ధర పడిపోవడంతో రైతులు సైతం కొబ్బరి బొండాల విక్రయం వైపే దృష్టి సారిస్తున్నారు. ఎగుమతిదారులు నేరుగా తోటల్లో కొబ్బరి బొండాల చెట్లను గుర్తించి కాయకు రూ.10 చొప్పున రైతు కు చెల్లించి మినీ వ్యాన్‌లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి, వెయ్యి బొండాలు రూ.15 వేల వరకు హోల్‌సేల్‌ ధరకు విక్ర యించి భారీగా సొమ్ములు చేసుకుంటున్నారు. 


Updated Date - 2021-05-05T06:04:02+05:30 IST