కొబ్బరి అన్నం

ABN , First Publish Date - 2021-08-14T17:42:44+05:30 IST

క్యాలీఫ్లవర్‌ ముక్కలు - నాలుగు కప్పులు, కొబ్బరితురుము - రెండు కప్పులు, కొబ్బరినూనె - రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, శనగపప్పు

కొబ్బరి అన్నం

కావలసినవి: క్యాలీఫ్లవర్‌ ముక్కలు - నాలుగు కప్పులు, కొబ్బరితురుము - రెండు కప్పులు, కొబ్బరినూనె - రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, శనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, వేరుశనగలు - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం: క్యాలీఫ్లవర్‌ ముక్కలను వేగించి (డ్రై రోస్ట్‌) పక్కన పెట్టుకోవాలి. వేరుశనగలను వేగించి పక్కన పెట్టాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొబ్బరి నూనె వేసి వేడి అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. మినప్పప్పు, శనగపప్పు వేసి వేగించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న వేరుశనగలు, క్యాలీఫ్లవర్‌ ముక్కలు వేసి కలపాలి. తగినంత ఉప్పు వేసి, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. చివరగా కొబ్బరి తురుము వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి అంతటా సమంగా కలిసేలా కలుపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-08-14T17:42:44+05:30 IST