కొబ్బరి నీళ్లు సిప్‌ చేస్తూనే ఉంటా!

ABN , First Publish Date - 2021-09-06T05:30:00+05:30 IST

టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న నటి కాజల్‌ అగర్వాల్‌. ఈ నాజూకు సుందరి తన ఆరోగ్య రహస్యాన్ని, డైట్‌ ప్లాన్‌ని చెప్పుకొచ్చిందిలా...

కొబ్బరి నీళ్లు సిప్‌ చేస్తూనే ఉంటా!

టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న నటి కాజల్‌ అగర్వాల్‌. ఈ నాజూకు సుందరి తన ఆరోగ్య రహస్యాన్ని, డైట్‌ ప్లాన్‌ని చెప్పుకొచ్చిందిలా...


  1. రోజూ రెండు లీటర్ల నీళ్లు తప్పకుండా తాగుతాను. తక్కువ ఆహారం, ఎక్కువ సార్లు తీసుకోవడానికి ఇష్టపడతాను. 
  2. గ్రీన్‌టీ, పుదీనా, తేనె, అవొకడోతో నా దినచర్య ప్రారంభమవుతుంది. వర్కవుట్స్‌ తరువాత కొబ్బరి నీళ్లు, చియా సీడ్స్‌, స్ట్రాబెర్రీ, వెనీలాతో చేసిన స్మూతీ తీసుకుంటాను. 
  3. బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ లేదా పీనట్‌ బటర్‌తో బ్రౌన్‌ బ్రెడ్‌, ఎగ్‌వైట్స్‌ తీసుకుంటాను. లంచ్‌లో గ్రీన్‌సలాడ్‌, పండ్లు, బ్రౌన్‌రైస్‌, సాయంత్రం ఏదైనా తాజా ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతాను. 
  4. డిన్నర్‌లో వెజ్‌ సూప్‌తో పాటు ఆలూ చాప్స్‌, గ్రీన్‌ సలాడ్‌ ఉండేలా చూసుకుంటాను. ఒక్కోసారి బర్గర్‌ తింటాను. 
  5. మైదా, గోధుమ, రైస్‌ బదులుగా క్వినోవా, రాజ్‌గిరా, బక్వీట్‌ తీసుకుంటాను. శరీరంలోని టాక్సిన్స్‌ బయటకు పోవడానికి కొబ్బరి నీళ్లు రోజంతా సిప్‌ చేస్తూనే ఉంటాను. గ్రీన్‌ టీ అంటే ఇష్టం. నా బౌల్‌లో సిట్రస్‌ ఫ్రూట్స్‌ తప్పకుండా ఉండాల్సిందే. వేసవిలో మామిడిపండ్లు వదలను. 
  6. పాల పదార్థాలు, వైట్‌ రైస్‌, వేపుడు పదార్థాలు, ప్యాక్డ్‌ ఫుడ్‌, జంక్‌ఫుడ్‌ జోలికి వెళ్లను. ఇక నా ఫేవరేట్‌ అంటే ఇడ్లీ, దోశ, పరోటా, పిజ్జా ఇంకా హైదరాబాద్‌ బిర్యానీ. ఎప్పుడైనా ఎక్కువ లాగిస్తే మరుసటి రోజు ఎక్స్‌ట్రా వర్కవుట్స్‌ చేసి ఆ క్యాలరీలను కరిగిస్తాను.

Updated Date - 2021-09-06T05:30:00+05:30 IST