భక్తులకు ప్రసాదంగా నారికేళ జలం

Sep 28 2021 @ 09:37AM

పెరంబూర్‌(చెన్నై): ఆలయాల్లో తొలిసారిగా భక్తులకు నారీకేళ జలం ప్రసాదంగా అందించే పథకం ప్రారంభమైంది. కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం తంజావూరుకు వచ్చారు. ఈ సందర్భంగా మారియమ్మన్‌ ఆలయంలో తొలిసారిగా భక్తులకు నారీకేళజలం ప్రసాదంగా అందజేసే పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం రూ.7 లక్షల విలువతో ప్రత్యేక యంత్రం ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు విస్తరించనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.