కోవై-బెంగుళూరు మార్గంలో భారీ వాహనాల నిషేధం

ABN , First Publish Date - 2022-04-07T14:22:35+05:30 IST

కోవై-బెంగుళూరు రహదారిలో 12 చక్రాలకు పైగా ఉన్న భారీ వాహనాలకు మద్రాసు హైకోర్టు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సత్యమంగళం పులుల సంరక్షణ కేంద్రం మీదుగా కోవై-

కోవై-బెంగుళూరు మార్గంలో భారీ వాహనాల నిషేధం

                             - మద్రాసు హైకోర్టు


ప్యారీస్‌(చెన్నై): కోవై-బెంగుళూరు రహదారిలో 12 చక్రాలకు పైగా ఉన్న భారీ వాహనాలకు మద్రాసు హైకోర్టు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సత్యమంగళం పులుల సంరక్షణ కేంద్రం మీదుగా కోవై-బెంగుళూరు మార్గంలో 16.2 టన్నులకు పైగా బరువైన వాహనాల రాకపోకలను ఎప్పటికీ అనుమతించేది లేదని హైకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఏనుగుల సంరక్షణ సంఘం అధ్యక్షుడు ఎస్పీ చొక్కలింగం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ పూర్తికావడంతో హైకోర్టు తీర్పు వెలువరించింది. కోవై-బెంగుళూరు రహదారిలో సాయంత్రం6 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు 12 చక్రాలకు తక్కువగా ఉన్న వాహనాలు గంటకు 30 కి.మీ వేగంతో వెళ్లేందుకు అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - 2022-04-07T14:22:35+05:30 IST