కోవై-షిర్డీ రైలు బుకింగ్‌కు రూ. కోటి డిపాజిట్‌

Published: Wed, 06 Apr 2022 10:15:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కోవై-షిర్డీ రైలు బుకింగ్‌కు రూ. కోటి డిపాజిట్‌

ఐసిఎఫ్‌(చెన్నై): ‘భారత్‌ గౌరవ్‌’ పథకం కింద కోయంబత్తూర్‌-షిర్డీ మధ్య రైలు నడిపేందుకు ఓ వ్యక్తి రూ. కోటి డిపాజిట్‌ చేశాడని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. భారతదేశంలో ఉన్న పారంపర్య, సంస్కృతి, ఆధ్యాత్మిక, పర్యాటక స్థలాల సందర్శనకు విదేశాలకు చెందిన వారిని తీసుకెళ్లేందుకు భారత్‌ గౌరవ్‌ పథకాన్ని రైల్వేశాఖ ప్రకటించింది. ఆ ప్రకారం ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు బుకింగ్‌ చేసుకొని రైలు నడుపువచ్చు. ఆ ప్రకారం రైళ్ల పర్యవేక్షణ, స్టాపింగ్‌ వంటి సౌకర్యాలకు రైల్వే శాఖ సహాయం చేస్తోంది. రైళ్లు నడపడం మాత్రమే ప్రైవేటు సంస్థల పని. ఈ నేపధ్యంలో, మేలో కోయంబత్తూర్‌-షిర్డీ మధ్య భారత్‌ గౌరవ్‌ రైలు నడిపేందుకు ఓ వ్యక్తి రూ. కోటి డిపాజిట్‌ చేశారని, దక్షిణ రైల్వేలో ఏడుగురు వ్యక్తులు ఈ పథకం కింద రైళ్లు నడిపేందుకు నమోదుచేసుకున్నారని దక్షిణ రైల్వే తెలిపింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.