Advertisement

పల్లె ప్రకృతి పనులు వెంటనే పూర్తి చేయాలి :కలెక్టర్‌

Dec 2 2020 @ 22:47PM
ధాన్యాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావ్‌

దేవరకద్ర, డిసెంబరు 2: మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు. బుధ వారం మండల పరిధిలోని అజీలాపూర్‌, బొల్లారం,  చౌదర్‌పల్లి గ్రామాల్లోని పల్లె ప్రకృతి పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొల్లారం గ్రామంలో పనులు జరగక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సక్రమంగా చేయాలని ఆదేశించారు. మొ క్కలను పెంచాలని సూచిం చారు. అలాగే నాగారం లో ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని పరిశీలించారు. ఆ యన వెంట అధికారులు ఉన్నారు.

Follow Us on:
Advertisement