ఆరుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2021-11-21T06:59:22+05:30 IST

యజమాని బాధ్యతారాహిత్యం, అధికారుల అలసత్వం, అవినీతితో ఓ మూడంతస్తుల భవనం కూలి ఆరుగురు దుర్మరణం చెందారు.

ఆరుగురు దుర్మరణం
సహాయక చర్యలుచేపట్టిన బృందాలు

కూలిన మేడ

మున్సిపల్‌ అధికారుల తీరుపై విమర్శలు

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ స్థానికుల ఆగ్రహం

కదిరి, నవంబరు 20: యజమాని బాధ్యతారాహిత్యం, అధికారుల అలసత్వం, అవినీతితో ఓ మూడంతస్తుల భవనం కూలి ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు స్త్రీలు ఉ న్నారు. శనివారం తెల్లవారుజామున 2.45 నిమిషాలకు కదిరిలోని పా త చైర్మన వీధి బీఎ్‌సఎనఎల్‌ కార్యాలయం ఎదుట ఈ దుర్ఘటన జరిగిం ది. ప్రమాదంలో 9 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిలో సైదున్నీషా (2), పరున్నీషా (8 నెలలు), భాను (30), యాషి కా (3), ఫాతిమాబీ (65), ఫైరోజా (65) ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన 9 మందిని అధికారులు, స్థానికులు రక్షించి, ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరు శిథిలాల కింద 10 గంటలపాటు న రకయాతన అనుభవించినట్టు పేర్కొన్నారు. ఎనడీఆర్‌ఎ్‌ఫ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, స్థానిక పోలీసులు 12 గంటలపాటు శ్రమించి, అందరినీ బయటకు తీశారు. 


 భవనం ఎలా కూలిందంటే.. 

పాత చైర్మన వీధిలోని మూడంతస్తుల భవనం జిలాన అనే వ్యక్తికి చెందినది. ఇందులో గ్రౌండ్‌ఫ్లోర్‌ 20 ఏళ్ల కిందట నిర్మించారు. అది మట్టితో కట్టినట్లు తెలిసింది. దానిపైన మరో రెండు అంతస్తులు నిర్మించారు. రెండో అంతస్తుపైన ప్రస్తుతం మరో గది కడుతున్నారు. ఈ రెండు అంతస్తుల నిర్మాణానికి మున్సిపల్‌ అనుమతులు లేవు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం తెల్లవారు జామున 2.45 గంటలకు ఈ భవనం కుప్పకూలి పక్కనే ఉన్న రెండు భవనాలపై పడింది. ఒక భవనంలో కింద అంతస్తులో రాజు, ఉదయ్‌నాయక్‌, గౌతమ్‌నాయక్‌, తరుణ్‌నాయక్‌ ఉన్నారు. వారందరూ శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారి పైఅంతస్తులో ఉన్న ఓ చానల్‌ విలేకరి భార్య భాను, కూతురు యాషికా, అత్త ఫాతిమాబీ చనిపోయారు.  శిథిలాల కింద ఉన్న ఉదయ్‌నాయక్‌ చాకచక్యంగా వ్యవహరించి 100కు డయల్‌ చేశారు. దీంతో పోలీసు అధికారులు గుర్తించి, శిథిలాలను తొలగించారు. నలుగురిని క్షేమంగా బయటకు తీయగలిగారు. స్వల్పంగా గాయపడిన వారందరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో భవనంలో కరీముల్లాతోపాటు ఆయన ఇద్దరు కుమారులు, కోడలు, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. వారందరినీ పోలీసులు రక్షించారు. అదే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సైదున్నీషా, పరున్నీషా మృతిచెందారు. మూడంతస్తుల భవనం యజమాని జిలాన తల్లి ఫైరోజా కూడా మృతి చెందింది. వీరి మృతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టంకి తరలించారు. 


ఉదయాన్నే పెళ్లికి వెళ్దామనుకుని...

ఒక భవనంలో నివాసముంటున్న కరీముల్లా ఆరుగురు కుటుంబ సభ్యులు శనివారం కడపలో జరిగే పెళ్లికి వెళ్లాలని సిద్ధమయ్యారు. పెద్దకోడలు, ఆమె కుమారుడు ముందుగానే వెళ్లడంతో వారు సురక్షితంగా ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయి చనిపోయిన సైదున్నీషా, పరున్నీషా ఈ కుటుంబ సభ్యులే.


ఊరికి వెళ్లలేక చిక్కుకుపోయారు..

మరో భవనం శిథిలాల్లో ఇరుక్కుపోయి ప్రాణాలతో బయటపడిన ఉదయనాయక్‌, గౌతమ్‌ నాయక్‌ది కదిరి మండలంలోని మీటే నాయక్‌ తండా, త రుణ్‌ నాయక్‌ది గోల్లోల్ల చెరువుతండా. కదిరికి అన్ని వైపులా శుక్రవారం రాత్రి నీరు రావడంతో సొంత గ్రామాలకు వెళ్లలేక గౌతమ్‌ నాయక్‌, తరుణ్‌నాయక్‌ కదిరిలోనే ఉండిపోయారు. తెల్లవారుజామునే భవనం కూలిపోయింది. చిన్న గాయాలతో బయటపడటం తమ అదృష్టంగా చెబుతున్నారు.


అధికారుల అవినీతే కారణం..

మున్సిపాల్టీలో ఇల్లు నిర్మించాలంటే టౌనప్లానింగ్‌ అధికారి అనుమతి కావాలి. అక్రమ నిర్మాణాలను చేపడితే వాటిని తొలగించే అధికారం కూడా టౌనప్లానింగ్‌ అధికారికి ఉంది. పాత చైర్మన వీధిలో నిర్మిస్తున్న ఈ భవనం నాణ్యత లేదని ఆ వీధిలో ఉండే ప్రజలు పలుమార్లు టౌన ప్లానింగ్‌ అధికారి దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. అయినా టౌనప్లానింగ్‌ అధికారి రహిమాన పట్టించుకోలేదు. చివరకు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీలకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినా పెడచెవిన పెట్టినట్లు  ప్రజలు చెబుతున్నారు. పక్క ఇంటివారు పదే పదే చెప్పినా భవన య జమాని పట్టించుకోలేదని వాపోయారు. అధికారుల అవినీతితోనే ఆరుగురు చనిపోయారని చెప్పారు. ఈ మరణాలకు మున్సిపల్‌ అధికారులే కారణమని మండిపడుతున్నారు. వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నారు.








మున్సిపల్‌ అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి 

మృతులకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

కందికుంట డిమాండ్‌

మృతదేహాలతో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

కదిరి, నవంబరు 20: పట్టణంలోని పాత చైర్మన వీధిలో మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే మూడంతస్తుల భవనం కూలి ఆరుగురు చనిపోయారనీ, దీనికి కారణమైన మున్సిపల్‌ అధికారులపై క్రిమినల్‌ చర్య లు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మృతదేహాల తో ఆయన ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాల్టీలోని టీపీఓ రహిమాన, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల అడ్డగోలుగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీపీఓ అవినీతి వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు ఎన్నోమార్లు టౌనప్లానింగ్‌ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదన్నారు. పట్టణంలో డబ్బు ఇస్తే అనధికారికంగా లేఔట్లు, కట్టడాలు అయినా కట్టుకోవచ్చన్నారు. చివరకు వంకలు, వాగుల పక్కన కూడా ఇల్లు కడుతున్నా డ బ్బు తీసుకుని, పట్టించుకోవడం లేదన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అధికారులకు అధికారపక్ష నాయకులు వంతపాడుతున్నారని ఆరోపించారు. మృ తులకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. క్షతగాత్రులకు రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు సీపీఐ జిల్లా నేత వేమయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-11-21T06:59:22+05:30 IST