కూలిన చప్టా

ABN , First Publish Date - 2022-05-18T04:55:05+05:30 IST

నగరపంచాయతీ పరిధిలోని పాల కేంద్రం వద్ద గ్రానైట్‌ లారీ వె ళ్తుండగా ఒక్కసారిగా చప్టా కూలిపోయిన సం ఘటన కందుకూరు రోడ్డులోని పాలకేంద్రం వద్ద సోమవారం రాత్రి జరిగింది.

కూలిన చప్టా
కూలిన చప్టాను రాత్రికి రాత్రే తొలగించడంతో ఏర్పడిన గుంత


నిలిచిన రాకపోకలు

1500 మంది ప్రజలకు ఇబ్బందులు

వెంటనే నిర్మించాలని డిమాండ్‌

కనిగిరి, మే 17: నగరపంచాయతీ పరిధిలోని పాల కేంద్రం వద్ద గ్రానైట్‌ లారీ వె ళ్తుండగా ఒక్కసారిగా చప్టా కూలిపోయిన సం ఘటన కందుకూరు రోడ్డులోని పాలకేంద్రం వద్ద సోమవారం రాత్రి జరిగింది. ఈ విషయం మంగళ వారం వెలుగు చూ సింది. వివరాల్లోకి వెళితే కనిగిరి సమీ పంలోని శం ఖవరం వద్ద ఉన్న పాల కేంద్రం పక్కనే చప్టా ఉంది. ఈ చప్టా మీదుగా శంఖ వ రం 3వ వార్డుకు చెందిన ప్ర జలు నిత్యం రాకపోకలు సాగి స్తుంటారు. గార్లపేట రోడ్డులో ఉన్న గ్రానైట్‌ క్వారీలకు చెం దని లారీలు పెద్ద పెద్ద రాళ్ల లోడుతో ఈ చప్టా గుండా కందుకూరు రోడ్డుకు ప్రవే శిస్తాయి. అక్కడి నుంచి కందుకూరు, ఒంగోలు, పామూరు రోడ్లకు గ్రానైట్‌ లారీలు వెళ్తుంటాయి. సోమవారం రాత్రి గ్రానైట్‌ రాళ్ల లోడుతో లారీ వెళ్తుండగా ఒక్కసారిగా చప్టా కూలిపోయింది. దీంతో లారీ వెనుక బాగం దిగబడి పోయింది. రాత్రికిరాత్రి లారీని తీయించారు. కూలిన చప్టాను తెల్లవారే సరికి ఎక్స్‌కవేటర్‌తో తొల గించారు.  దీంతో అక్కడ పెద్ద గుంత ఏర్ప డింది. చప్టాను ఎప్పుడు నిర్మిస్తారని గ్రామ స్థులు ప్రశ్ని స్తున్నారు.  దాదాపు 400 గృహా లకు చెందిన ప్రజలు దాదాపు 1500 మంది రాకపోకలకు ఈ చప్టానే ఆధారం. అది కూలి పోవటంతో రాకపోకలు లేక ప్రజలు ఇబ్బం దులు ఎదు ర్కొంటున్నారు.

గ్రానైట్‌ లారీలు తిప్పవద్దని మొత్తుకున్నాం

చప్టా కూలిపోయే ప్రమాదం ఉందని, ఈ రోడ్డులో గ్రానైట్‌ లారీలు తిప్పవద్దని చాలాసార్లు గ్రానైట్‌ క్వారీ యజమా నులకు విన్నవించుకున్నా పట్టించు కోలేదు. దీనిపై నిరసనలు, ధర్నాలు కూ డా చేపట్టాం. ఆ సమయంలో ప్రస్తుత పాలకులు గ్రానైట్‌ లారీలు తిరగకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అయినా గ్రానైట్‌ లారీలు తిరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై శంఖవరం 3వ వార్డు ప్రజలు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.  అందరూ అనుకున్నట్లే చప్టా కూలిపోయింది.  ప్రధాన రోడ్డుకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాలి.  రాత్రి వేళల్లో మహిళలు  రావడం కష్టమే. గ్రానైట్‌ క్వారీలపై చర్యలు తీసు కుని వెను వెంటనే చ ప్టాను నిర్మించేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలి. 

షేక్‌ బారాయిమాం, శంఖవరం


Updated Date - 2022-05-18T04:55:05+05:30 IST