అక్టోబర్‌ 20కి ఇళ్ల నిర్మాణాలన్ని ప్రారంభం కావాలి

ABN , First Publish Date - 2022-08-19T05:49:17+05:30 IST

జిల్లాలోని జగనన్న పేదలందరికి ఇళ్ల పథ కం లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు అక్టోబరు 20 నాటికి పూర్తిస్థాయిలో ప్రారం భం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ ఆదేశిం చారు.

అక్టోబర్‌ 20కి ఇళ్ల నిర్మాణాలన్ని ప్రారంభం కావాలి
వీడియో కాన్ఫరెన్స్‌లకు హాజరైన కలెక్టర్‌, జేసీ ఇతర అధికారులు

సీఎస్‌ సమీర్‌ శర్మ

గుంటూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జగనన్న పేదలందరికి ఇళ్ల పథ కం లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు అక్టోబరు 20 నాటికి పూర్తిస్థాయిలో ప్రారం భం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ ఆదేశిం చారు. గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన కలె క్టర్‌తో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఇళ్ల పథ కం, మనబడి నాడు - నేడు రెండో దశ పనులపై జిల్లాలో పురోగతిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకు ఇళ్ల నిర్మాణం కోసం బ్యాంకర్ల ద్వారా రుణాలు మంజూరయ్యేలా డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. లేఅవుట్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ని ఆదేశించారు.  

ఈ-క్రాప్‌ బుకింగ్‌ని పర్యవేక్షించాలి

ప్రతీ గ్రామంలో ఈ-క్రాప్‌ బుకింగ్‌ని పర్యవేక్షించాలని సీసీఎల్‌ఏ జీ సాయిప్రసాద్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. ఎక్కడైనా వ్యత్యా సం కనిపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమగ్ర భూసర్వేకి సంబంధించి రికార్డుల స్వచ్ఛీకరణ, గ్రౌండ్‌ ట్రూతింగ్‌, వ్యాలి డేషన్‌ తదితర ప్రక్రియాలు సమాంతరంగా నిర్వహించాలన్నారు.  

ప్రభుత్వ ప్రాధాన్య భవనాలు పూర్తి చేయాలి

ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణాలు నిర్దేశిత  సమయంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ కలెక్టర్‌ని ఆదేశిం చారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరం పెండింగ్‌ బిల్లులను 19వ తేదీ సాయంత్రం నాటికి కచ్ఛితంగా అప్‌లోడింగ్‌ చేయాలన్నారు. కాగా జిల్లాలో మన బడి నాడు - నేడు రెండో దశ ద్వారా పాఠశాలల్లో జరుగుతోన్న అభివృద్ధి పనులకు అవసరమైన సెంటర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఎలక్ట్రికల్‌, శానిటరీ ఉపకరణాల ప్రతిపాదనలను వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్య దర్శి బుడితి రాజశేఖర్‌ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సమావేశా లకు కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జేసీ రాజకుమారి, సబ్‌ కలెక్టర్‌ నిధి మీనా, డీఆర్‌వో కే చంద్రశేఖర్‌రావు, ఎస్‌డీసీ లలిత, సర్వే ఏడీ, డిప్యూటీ కలెక్టర్లు పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ, డ్వామా పీడీ తదితర అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T05:49:17+05:30 IST