అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-07T06:35:12+05:30 IST

అంబులెన్స్‌ సేవల కోసం జిల్లాలో ధరలు నిర్ణయించారు.

అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు : కలెక్టర్‌

విజయవాడ సిటీ, మే 6 : అంబులెన్స్‌ సేవల కోసం జిల్లాలో ధరలు నిర్ణయించారు. ప్రైవేట్‌ అంబులెన్స్‌ యజమానుల అక్రమ వసూళ్లపై నిఘా పెట్టి అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. మారుతి ఓమ్ని/ ఈకో/ టెంపో/ తుఫాన్‌  అంబులెన్స్‌లకు 10 కిమీ దూరానికి కొవిడ్‌ మృతదేహాల తరలింపునకు రూ.1700, నాన్‌కొవిడ్‌ మృతదేహాలకు రూ.2800గా నిర్ణయించారు. కొవిడ్‌కు మారుతీ ఓమ్ని/ ఈకో 41 నుంచి 50 కి.మీ.లకు రూ.2860, నాన్‌ కొవిడ్‌కు రూ.3960గా, కొవిడ్‌కు  టెంపో/ తుఫాన్‌ రూ.3190, నాన్‌కొవిడ్‌కు 4290లుగా, కొవిడ్‌కు మారుతీ ఓమ్ని/ ఈకో అంబులెన్స్‌లకు 101 నుంచి 110 కి.మీలకు రూ.4620గా, నాన్‌కొవిడ్‌- 5720గా, కొవిడ్‌కు టెంపో/ తుఫాన్‌లకు రూ.5060గా, నాన్‌కొవిడ్‌- రూ.6160గాధరలను నిర్ణయించినట్టు తెలిపారు. మృతదేహాలను ఆసుపత్రి, మార్చురీ నుంచి బాధితుల ఇళ్లు, శ్మాశాన వాటిక తదితర ప్రాంతాలకు చేరవేసే సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన ధరలు ప్రకారం వసూలు చేయాలన్నారు. అధిక ధరలు వసూలు చేసే వారిపై బాఽధితులు కొవిడ్‌ కంట్రోల్‌రూమ్‌ నంబర్‌ 94910 58200కు ఫిర్యాదు చేయాలన్నారు. 


Updated Date - 2021-05-07T06:35:12+05:30 IST