అభివృద్ధి పనులు తనిఖీకి టీములు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2020-12-03T04:07:42+05:30 IST

మునిసిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులు తనిఖీ నిర్వహణకు టీములు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులు తనిఖీకి టీములు ఏర్పాటు చేయాలి

 కొత్తగూడెం, డిసెంబరు 2: మునిసిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులు తనిఖీ నిర్వహణకు టీములు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి జిల్లా అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, చైర్‌పర్సన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత నెల 24వ తేదీ నుంచి 28 వరకు గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన తనిఖీలు ప్రకారం మునిసిపాలిటీల్లో కూడా తనిఖీలు నిర్వహిం చనున్నామని కాబట్టి ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుస రించి పనులు పూర్తిచేసి తనిఖీలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో కోతు లు, పందులు, కుక్కల సంచారాలను నిరోధించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలన్నారు. పందుల పెంపకంతో జీవిస్తున్న కుటుంబాలకు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామని ప్రజల ఆరోగ్యాన్ని దృ ష్టిలో ఉంచుకొని పందుల సంచారాలను నిరోధించా లన్నారు. కుక్కల వృద్ధిని నిరోధించేందుకు చేపట్టనున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు ప్రక్రియను చేపట్టా లన్నారు. మునిసిపాలిటీలతోపాటు సారపాక, భద్రాచ లంలో సిబ్బందికి తప్పక బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేసి, ప్రతి రోజు ఉదయం 6గంటలకు హాజరు నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఇటీవల గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీ నివేదికలు ఆధారంగా అదనపు కలెక్టర్లు క్రాస్‌ చెకింగ్‌ చేయాల న్నారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు తనిఖీలు నిర్వహి స్తామన్నారు. గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల్లో వ్యర్ధాలు సేకరణకు వినియోగిస్తున్న ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటో లు నడుపుటకు అనుభవజ్ఞులైన, అంకితభావం కలిగిన లైసెన్సులు కలిగిన డ్రైవర్లను వినియోగించుకోవాలన్నారు. ఇటీవల గుండాల మండలంలో ఇద్దరు పారిశుధ్య కార్మికులు ట్రాక్టర్‌ పల్టీలో మరణించడం చాలా బాధాక రమని ఈ సంఘటన మనందరికీ ఒక గుణపాఠమని, ఇటువంటి సంఘటనలు జరిగితే సర్పంచ్‌లు, కార్యద ర్శులు మునిసిపల్‌ చైర్మన్లు, కమిషనర్లే బాధ్యత వహించా లన్నారు. వీధి వ్యాపారులకు రుణాలు మంజూరీలో బ్యాంక్‌ కంట్రోలింగ్‌ అధికారులు జాప్యం లేకుండా రుణాలు మంజూరీకి సహకరించాలని కలెక్టర్‌ కోరారు. రుణాల మంజూరులో జాప్యం చేస్తున్న బ్యాంక్‌ కం ట్రోలింగ్‌ అధికారులపై ఆర్‌బీఐకి తగు చర్యల నిమిత్తం సిఫార్సు చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2020-12-03T04:07:42+05:30 IST