పల్లెల్లో ఇంటింటికీ కుళాయి

ABN , First Publish Date - 2020-12-03T06:26:16+05:30 IST

జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చటానికి.. ఇంటింటికీ తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాన్ని ప్రారంభించామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ చెప్పారు.

పల్లెల్లో ఇంటింటికీ కుళాయి
జలజీవన్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌

 కొత్తగా 5,45,702 మంచినీటి ట్యాప్‌ కనెక్షన్లు

బ్రోచర్‌ ఆవిష్కరణలో కలెక్టర్‌ ఇంతియాజ్‌

ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చటానికి.. ఇంటింటికీ తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాన్ని ప్రారంభించామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని జిల్లాలో ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. బుధవారం నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఇన్‌చార్జి సాయినాధ్‌తో కలిసి జల్‌జీవన్‌ మిషన్‌ వాల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ను రూ.611.12 కోట్ల వ్యయంతో అమలు చేయనున్నట్టు తెలిపారు.  ఈ పథకంలో జిల్లాలో కొత్తగా 5,45,702 గృహాలకు కుళాయి కనెక్షను ఇవ్వనున్నట్లు తెలిపారు. నేషనల్‌ రూరల్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రోగ్రాం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ)లో ఇంటింటికీ మంచినీటి కనెక్షను అందించటానికి కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం)ను తీసుకువచ్చిందని చెప్పారు.  కొత్తగా ఓవర్‌హెడ్‌ స్టోరేజ్‌ రిజర్వాయర్స్‌ నిర్మాణం కోసం రూ. 189.24 కోట్ల వ్యయంతోను, ఈ పథకానికి సంబంధించి ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.390.74 కోట్ల వ్యయంతోను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.  

Updated Date - 2020-12-03T06:26:16+05:30 IST