ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-03-06T05:35:44+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణఆదిత్య, జేసీ స్వర్ణలత


భూపాలపల్లి కలెక్టరేట్‌, మార్చి 5 : ఎ మ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇన్‌చార్జ్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కృష్ణఆదిత్య తెలిపారు. ఈ నెల 14న జరుగునున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నల్గొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడి ఎన్నికల ఏర్పాట్లుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేయ్యాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలను స్వయంగా సందర్శించి ఫర్నిచర్‌ను పరిశీలించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీ్‌సబందోబస్త్‌ ఏర్పాటు చేయ్యాలన్నారు. పోలీస్‌బందోబస్త్‌ ఏర్పాటు చేసి బ్యాలెట్‌ బాక్సులను, బ్యాలెట్‌ పేపర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించి పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బ్యాక్సులను నల్గొండ జిల్లా కేంద్రంలోని కౌంటింగ్‌ కేందానికి తరలించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కృష్ణఆదిత్య మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల్లో 12, 388 మంది ఓటర్లు ఉన్నారని, మొత్తం 18 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో జేసీ కూరాకుల స్వర్ణలత, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:35:44+05:30 IST