ప్రజా వినతులపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2020-11-24T10:31:03+05:30 IST

ప్రజా వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ప్ర జా వినతులపై రోజువారీ సమీక్ష చేసి

ప్రజా వినతులపై దృష్టి సారించాలి

అధికారులతో అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి


ములుగు కలెక్టరేట్‌, నవంబరు 23: ప్రజా వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ప్ర జా వినతులపై రోజువారీ సమీక్ష చేసి వెనువెంటనే పరిష్కరించాలన్నా రు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలకు ప్రాధాన్య క్ర మంలో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. లైబ్రరీ, క్రీడా శిస్తు వసూలును లైబ్రరీ, క్రీడాశాఖకు అందజేసి వాటి అభివృద్ధికి సహకరించాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కాలర్‌షి్‌పలకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన ప్యాడీ క్లీనర్లు కొనుగోలు చేయాలన్నారు. మినీ డెయిరీ పైలట్‌ ప్రాజెక్టు అమలుకు 20 ఎకరాల స్థలం కేటాయించినట్లు చెప్పారు. షెడ్ల నిర్మాణాలు, పశువుల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని,  పశుగ్రాసం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించా రు. జిల్లాలో 170 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారులు రెగ్యూలర్‌గా కొనుగోలు కేంద్రాలను దర్శించి రిమార్కులు ఫొటోగ్రా్‌ఫతోపాటు సమర్పించాలన్నారు.


జిల్లాలోని గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పాఠశాలలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లు, పల్లెప్రకృతివనాలు తదితర పనులను పూర్తిచేయాలన్నారు.  గ్రామాల సమగ్ర డాటా రూపొందించాలని అన్నారు. జాకారం గ్రామంలో అటవీ భూవివాదంలో శాటిలైట్‌ చిత్రాలతో రెవెన్యూ గ్రామమొత్తం విస్తీర్ణం గెజిట్‌ ప్రకారం అటవీ భూమి, తదితర వివరాలన్నీ సేకరించి పరిష్కరించాలన్నారు. ఎస్డీఎల్సీ సమావేశంలో 3(1)కేసులు పరిష్కరించాలని, 3(2) కేసుల విషయమై చర్చించాలన్నారు. కన్నాయిగూడెం మండలపరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. డీఆర్వో రమాదేవి, డీఆర్‌డీవో పారిజాతం, జడ్పీ సీఈవో ప్రసూనారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-24T10:31:03+05:30 IST