Advertisement

అమూల్ మిల్క్ యూనిట్‌‌లో కలెక్టర్

Feb 26 2021 @ 19:48PM

ప్రకాశం: పాలు పోసిన రైతులకు ఇవ్వాలసిన చెల్లింపులను అమూల్ డెయిరీ నిలిపివేయడంతో కలెక్టర్ పోలా భాస్కర్ స్పందించారు. పాడి రైతులకు డబ్బులు ఇవ్వడం లేదని ఏబీఎన్‌ వార్తా కథనాలు ప్రసారం చేసింది. దీంతో కలెక్టరు భాస్కర్ అమూల్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించారు. అమూల్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఒంగోలు డెయిరీలో నిర్వహిస్తున్నారు. పాలసేకరణ కేంద్రాల్లో వస్తున్న బిల్లులకు, అమూల్ ఇస్తున్న చెల్లింపులకు వ్యత్యాసం ఎందుకు వస్తుందో సిబ్బందిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. వెంటనే రైతులకు బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధాకారులను ఆదేశించారు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.