అర్హులందరికీ సేవలందించాలి

ABN , First Publish Date - 2021-01-24T06:17:04+05:30 IST

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడంలో, ప్రభుత్వ లబ్ధిని అర్హులకు అందించటంలో సచివాల యాలు కీలకపాత్ర వహించాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అన్నారు.

అర్హులందరికీ సేవలందించాలి
రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్‌

అర్హులందరికీ సేవలందించాలి

కలెక్టర్‌ ఇంతియాజ్‌  

విద్యాధరపురం, జనవరి 23 : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడంలో, ప్రభుత్వ లబ్ధిని అర్హులకు అందించటంలో సచివాల యాలు కీలకపాత్ర వహించాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అన్నారు.  విద్యా ధరపురంలోని 116, 117, 118, 119 వార్డు సచివాలయాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు పౌర సౌకర్యాలు అందించటంలో, ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో వార్డు సచి వాలయ సిబ్బంది ప్రజలతో మమేకమై ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలన్నారు. తొలుత వార్డు సచివాలయాల్లో అన్ని విభాగాల సిబ్బంది పనిని కలెక్టర్‌ అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు.  పశ్చిమ తహసీల్దార్‌ మాధురి పాల్గొన్నారు.

సేవాభావంతో పనిచేయాలి

ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తు లను పెండింగ్‌ లేకుండా పరిష్కరిం చాలని అందు కోసం సిబ్బంది నిబద్ధతతో కూడి సేవాభావంతో పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) డాక్టర్‌ కె. మాధవీలత ఆదేశించారు. నగరం లోని 32, 33, 34, 35 సచివాలయాలను శనివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్‌ పంపిణీ నేపథ్యంలో బియ్యం కార్డుల మ్యాపింగ్‌  ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

Updated Date - 2021-01-24T06:17:04+05:30 IST