వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

Sep 17 2021 @ 23:44PM
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌

గద్వాల క్రైం/ అలంపూర్‌, సెప్టెంబరు, 17 : జిల్లాలో 15 రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశం హాలు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అలంపూర్‌ నుంచి ఎమ్మెల్యే అబ్రహాం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచన మేరకు 15 రోజు ల పాటు కరోనా వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే డ్రైవ్‌ విజయవంతం అవుతుందన్నారు. వ్యాక్సిన్‌ ఆవశ్య కతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, వృద్ధులు ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించు కోవాలన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయ వంతం చేసి రాష్ట్రంలోనే జిల్లాకు మంచిపేరు తేవాలన్నారు. కరోనా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, జిల్లా వైద్యాధికారి చందూనాయక్‌, జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: