నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-21T07:01:24+05:30 IST

మండలంలో మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పత్తి, మొక్కజొన్న పంటలను శుక్రవారం కలెక్టర్‌ బసంతకుమార్‌ పరిశీలించారు.

నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్‌
తిమ్మాపురం వద్ద నీట మునిగిన పంటలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ బసంత కుమార్‌

రొద్దం, మే 20: మండలంలో మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పత్తి, మొక్కజొన్న పంటలను  శుక్రవారం కలెక్టర్‌ బసంతకుమార్‌ పరిశీలించారు. దాదాపు 200 ఎకరాల్లో పంట నీట మునిగిందని స్థానిక రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయారు. నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిహారం వచ్చేలా ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అనంతరం తిమ్మాపురం వద్ద బ్రిడ్జి కుంగిపోవడంతో, వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అనంతచారి, ఎంపీడీఓ రాబర్ట్‌విల్సన, వ్యవసాయాధికారి నివేదిత పాల్గొన్నారు. 


పౌరసేవల్లో జాప్యం జరిగితే చర్యలు   

హిందూపురం టౌన: సచివాలయంలో ఆలస్యం లేకుండా ప్రజలకు సేవలు అందించాలని, జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామ ని కలెక్టర్‌ బసంతకుమార్‌ హెచ్చరించారు. శుక్రవారం ఆయన  మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ-శ్రమ్‌ కార్మికులకు గొప్పవరమని, ఈ పథకం పై ప్రజలకు అవగాహన కల్పించి నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని వార్డు వలంటీరు, సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్‌, వచ్చే నెలలో ప్రభు త్వ అమలు చేసే పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌ చేశారా లేదా అన్నది పరిశీలించారు.  సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వర్తించి ప్రభుత్వ పథకాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు. 


 హిందూపురం పట్టణపరిధిలోని పోచనపల్లి వంతెనను జిల్లా కలెక్టర్‌ బసంత కుమార్‌, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలించారు. కర్ణాటక ప్రాంతంలోరెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నానది పొంగి పరవళ్లు తొక్కుతుండటంతో వంతెన బాగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల రాకపోకలకు ఇ బ్బంది కలగకుండా వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ శాఖ సూపరింటెండెంట్‌ ఓబులరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, ఈఈ సంజీవయ్య, డీఈ నాగరాజు పాల్గొన్నారు. 


దెబ్బతిన్న పంటలకు పరిహారం

మడకశిర టౌన: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంట దెబ్బతిన్న రైతులకు నష్టాలను అంచనా వేసి పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకొంటామని తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌ అన్నారు. ఆర్‌ఆండ్‌బీ డీఈ శ్రీనివాసులు, నగరపంచాయ తీ కమిషనర్‌ లక్ష్మిదేవి, ఇరిగేషన శాఖ అధికారులతో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధికంగా 250.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అ యినట్లు తెలిపారు. వర్షానికి ఇప్పటివరకు 7 ఇళ్లు దెబ్బతిన్నాయ ని, 18 చెరువులు నీటీతో నిండాయన్నారు. ఎల్లోటి చెరువు వద్ద తూము లీకేజీ ఉన్నట్లు తెలిపారు. మండలవ్యాప్తంగా చెరువులు, చెక్క్‌డ్యామ్‌లు నిండాయని, ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు  జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర సమయంలో కంట్రో ల్‌ రూముకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ఆయన మండలంలోని హరేసముద్రం, వైబీ హళ్ళి, ఛత్రం, గౌడనహళ్ళి చెరువులను పరిశీలించారు. భారీ వర్ష సూచన ఉన్నందున చెరువులు, కుంటలు,నీటి ప్రవాహక ప్రాంతాలో నివాసం ఉన్న ప్రజలు సమీప కమ్యూనిటీ భవనాలు, పాఠశాల భవనాలు వంటి  సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. అత్యవసర సేవలకోసం తహసీల్దారు కార్యాలయం కంట్రోల్‌ రూమ్‌ ఫోననెంబర్‌ 6281698040 ను సంప్రదించాలని సూచించారు. 

Updated Date - 2022-05-21T07:01:24+05:30 IST