39 ఆస్పత్రుల్లో కొవిడ్‌కు వైద్యం

ABN , First Publish Date - 2021-04-22T06:17:01+05:30 IST

జిల్లాలో ఇదివరకూ గుర్తించిన 39 ఆస్పత్రులలో కొవిడ్‌ వైద్యం అం దుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు.

39 ఆస్పత్రుల్లో కొవిడ్‌కు వైద్యం

పాజిటివ్‌ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పకడ్బందీగా చేపట్టాలి...

ఆక్సిజనను అధికంగా నిల్వ ఉంచుకోండి...

అధికారులకు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశం

అనంతపురం,ఏప్రిల్‌21(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఇదివరకూ గుర్తించిన 39 ఆస్పత్రులలో కొవిడ్‌ వైద్యం అం దుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. ఆ ఆస్పత్రులకు నోడల్‌ అధికారులను నియమించడంతో పా టు బెడ్లను సైడ్ఫామ్‌ చేసి ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయో డిస్‌ప్లే చేయాలని సూచించారు. హెల్ప్‌ డెస్క్‌ల ను ఏర్పాటు చేయాలన్నారు. బుధవారం ఆయన నోడల్‌ అధికారులు, వైద్యాధికారులు తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలతో టెలీకాన్ఫరెన్స నిర్వహించారు. కొ విడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆస్పత్రుల సన్నద్ధత, హోమ్‌ ఐసొ లేషన, అంబులెన్స, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఆక్సిజన లభ్యత తదితర అంశాలపై సమీక్షించారు. కొవిడ్‌ బాధితులకు చికి త్స అందించే విధంగా 17 కొవిడ్‌ కేర్‌ సెంటర్లను బుధ వారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి తీసుకురావాల న్నారు. ఆ ఆస్పత్రుల్లో 5420 బెడ్లు వెంటనే సిద్ధం చేయా లన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో వైద్యాధికారుల బృందం, శానిటేషన, ఆహారం, రెవెన్యూ, పోలీసు తదితర 7 బృం దాలను ఏర్పాటు చేయాలన్నారు. గుర్తించిన ఆస్పత్రుల జాబితా, నోడల్‌ అధికారుల జాబితాను కొవిడ్‌ కేర్‌ సెంట ర్లలో ఉం చాలన్నారు. జిల్లాలో బుధవారం వరకూ 18 ఆస్పత్రులలో 1900 బెడ్లు ఏర్పాటు చేశా మన్నారు. ట్రయే జింగ్‌ సెంటర్లలో ఈసీజీ, ఎక్స్‌రే, పల్స్‌ ఆక్సిజన మీటర్లు తదితర సామగ్రిని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అం దుకు సంబంధించిన ఫొటోలను తనకు పంపాలని డీసీ హెచఎస్‌ రమేష్‌నాథ్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం చేస్తున్న పరీక్షల సామర్థ్యాన్ని 8 వేలకు పెంచా ల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా టెస్టింగ్‌ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సేకరించిన శాంపిళ్ల ను 6 గంటల్లోపు ల్యాబ్‌కు పంపేలా చర్యలు తీసుకోవాల న్నారు. డిమాండ్‌కు సరిపడా నిల్వలకు మూడు రెట్లు అ ధికంగా ఆక్సిజనను నిల్వ ఉంచుకునేలా ప్రణాళిక రూపొం దించుకోవాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల మొదటి, రెండవ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాల న్నారు. ప్రతి పాజిటివ్‌ కేసుకు 10 ప్రైమరీ కాంటాక్ట్‌లను, 21 మందికి పైబడి సెకండరీ కాంటా క్ట్‌లను గుర్తించాల్సి ఉందన్నారు. జిల్లాలో హోమ్‌ఐసొలేషనలో ఉన్న బాధితుల వద్దకు వైద్యులను పంపి వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్ప టికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎనఎం లు, హోమ్‌ ఐసోలేషనలో ఉన్న ప్రతి బాధితుడి ఇంటికెళ్లి కిట్లను అం దించాలన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలని డీ ఎంహెచఓను ఆదేశించారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే వారిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సుల ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ ని శాంతకుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


నేడు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన జిల్లాకు రాక


 అనంతపురం,ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్‌ గురువారం జిల్లాకు వస్తున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి బుధవారం మీడియాకు తెలిపారు. జిల్లా పరిషత సమావేశపు హాల్లో జిల్లా యంత్రాంగం, నోడల్‌ అధికారులతో మంత్రి కొవిడ్‌పై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. సమావేశానికి హాజరు కాని అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్షిస్తారన్నారు. 

Updated Date - 2021-04-22T06:17:01+05:30 IST