Advertisement

ఆక్సిజన సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా నిరోధించాలి

May 9 2021 @ 00:36AM

ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రెమ్‌డిసివిర్‌ వేయాలి

జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం, మే 8(ఆంధ్రజ్యోతి): ఆక్సిజన సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా నిరోధించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జేసీలు నిశాంతకుమార్‌, సిరి, ఆర్డీఓలు, డీఎ్‌ఫఓ, మున్సిపల్‌ కమిషనర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్లు, నోడల్‌ అధికారులతో టెలీకాన్ఫరెన్సలో మాట్లాడారు. గ్యాస్‌ ఫిల్లింగ్‌ ఏజెన్సీలను జిల్లా యంత్రాంగం ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. ఏజెన్సీల సామర్థ్యం, వారి నుంచి ఎక్కడికి సరఫరా అవుతోంది..? ప్రైవేట్‌ ఆస్పత్రుల వారీగా ఆక్సిజన ఎంత అవసరం తదితర సమాచారాన్ని తనకు తెలపాలన్నారు. కొందరు సి లిండర్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్‌మార్కెట్‌కు తరలించకుండా నిరోధించేందుకు అన్ని ఏజెన్సీల వద్ద ప్రభుత్వ సిబ్బందిని నియమించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఒక సెంట్రలైజ్డ్‌ ఆక్సిజన ట్యాంకు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఆక్సిజన కొరత ఏర్పడితే వెంటనే ఆ ట్యాంకును అక్కడికి తరలించి, ఆక్సిజన సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జేసీ నిశాంతకుమార్‌కు సూచించా రు. వ్యాక్సిన, రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షన్లను కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం ఇవ్వాలనీ, మిగిలిన 50 శాతం ఆయా సంస్థలు బహిరంగ మార్కెట్లో అమ్ముకు నేలా కేంద్రం సూచించిందన్నారు. ప్రభుత్వం నిర్ణయించి న ధరల మేరకే రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షనలు, వ్యాక్సిన వేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయా న్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల దృష్టికి తీసుకెళ్లాలని జేసీ సిరికి సూచించారు.


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.