ఎయిడ్స్‌ను నివారిద్దాం

ABN , First Publish Date - 2022-05-16T06:56:19+05:30 IST

సమష్టిగా కృషి చేసి, ఎయిడ్స్‌ను నివారిద్దామని జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఎయిడ్స్‌ క్యాండిల్‌ లైట్‌ మెమోరియల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి వైద్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఎయిడ్స్‌ను నివారిద్దాం

కలెక్టర్‌ బసంతకుమార్‌

పుట్టపర్తి, మే 15: 

సమష్టిగా కృషి చేసి, ఎయిడ్స్‌ను నివారిద్దామని జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఎయిడ్స్‌ క్యాండిల్‌ లైట్‌ మెమోరియల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి వైద్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో డీఎంహెచఓ డాక్టర్‌ పద్మావతి, ఆర్డీఓ భాగ్యరేఖ, డీపీఎం డాక్టర్‌ కుళ్లాయప్ప, డాక్టర్‌ నాగరాజునాయక్‌, వెంకటరత్నం, నగేశ, రామాంజనేయులు, టీఐ ప్రాజెక్టు మేనేజర్‌ దుర్గాదేవి, ఆరోగ్యసిబ్బంది, అనంత నెట్‌వర్క్‌ ఆఫ్‌ పాజిటివ్‌, వీహెచఎ్‌స సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-05-16T06:56:19+05:30 IST