ధర్మవరంలో డివిజన ‘స్పందన’

ABN , First Publish Date - 2022-05-29T06:00:51+05:30 IST

స్పందనలో వచ్చిన ప్రజా వినతులను వేగవంతంగా పరిష్కరించాలని శ్రీసత్యసాయిజిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ధర్మవరంలో డివిజన ‘స్పందన’

106 అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌

ధర్మవరం, మే 28

స్పందనలో వచ్చిన ప్రజా వినతులను వేగవంతంగా పరిష్కరించాలని శ్రీసత్యసాయిజిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో శనివారం డివిజన స్థాయి స్పందన కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ధర్మవరంలో 43, బత్తలపల్లిలో 3, తాడిమర్రిలో 7, ముదిగుబ్బలో 24, రామగిరిలో 4, కనగానపల్లిలో 10, చెన్నేకొత్తపల్లిలో 15 చొప్పున 106 అర్జీలు వచ్చినట్టు ఆర్డీఓ వరప్రసాదరావుతెలిపారు. పలు సమస్యలపై టీడీపీ నాయకులు కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. పట్టణంలో ప్రభుత్వభూములు, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ రిజర్వ్‌ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని కలెక్టర్‌కు టీడీపీనాయకులు విన్నవించారు. కొందరు నకిలీ పట్టాలను సృష్టించి అమాయక ప్రజలకు మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చేనేతలను ఆదుకోవాలని కోరుతూ టీడీపీ నాయకులు పురుషోత్తంగౌడ్‌, పరిశేసుధాకర్‌, కృష్ణాపురం జమీర్‌అహమ్మద్‌, గోసల శ్రీరాములు, కేతినేనిరాజు, తోటవాసు, ఓంప్రకాశ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.


Updated Date - 2022-05-29T06:00:51+05:30 IST