సచివాలయ సిబ్బంది మెరుగైన సేవలందించాలి

ABN , First Publish Date - 2022-01-23T05:41:48+05:30 IST

సచివాలయ సి బ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందిం చాలని కలెక్టర్‌ కార్తికే య మిశ్రా అన్నారు.

సచివాలయ సిబ్బంది మెరుగైన సేవలందించాలి
చెట్టున్నపాడు గ్రామస్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా,జేసీ శుక్లా

 చెట్టున్నపాడు, ఆగడాలలంకల్లో కలెక్టర్‌ కార్తికేయ పర్యటన

భీమడోలు, జనవరి 22 : సచివాలయ సి బ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందిం చాలని కలెక్టర్‌ కార్తికే య మిశ్రా అన్నారు. శనివారం చెట్టున్నపా డు, ఆగడాలలంక గ్రామాల్లో పర్యటించి గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. గ్రామాల్లో నూరుశాతం వ్యాక్సినేష న్‌ జరగాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ విస్తరి స్తున్న నేపథ్యంలో నిబంధనలు ప్రజలు పాటించాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదే శించారు. అనంతరం ఆగడాలలంకలో గ్రామంలో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. జేసీ హిమాన్షు శుక్లా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:41:48+05:30 IST