నాడు- నేడు ప్రారంభించండి

ABN , First Publish Date - 2022-05-20T06:29:09+05:30 IST

ప్రతి సచివాలయం పరిధిలో కనీసం ఒక నాడు నేడు పని ప్రారంభించాలని కలెక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు.

నాడు- నేడు ప్రారంభించండి
కలెక్టర్‌ కె.మాధవీలత

మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ సమీక్ష


రాజమహేంద్రవరం, మే 19(ఆంధ్రజ్యోతి) : ప్రతి సచివాలయం పరిధిలో కనీసం ఒక నాడు నేడు పని ప్రారంభించాలని కలెక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తర్వాత ఆమె మండలస్థాయి అధికారులతో సమీక్షించారు. నాడు నేడు కార్యక్రమాన్ని అంకిత భావంతో నిర్వహించాలన్నారు.జిల్లాలో  442 స్కూళ్లలో 811 తరగతి గదుల నిర్మాణానికి రూ.168 కోట్లతో పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. మొదట పేరెంట్స్‌ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన పనులు ప్రారంభించాలన్నారు. నాడు నేడు పనుల మెటీరియల్‌ పర్యవేక్షణకు మండల విద్యాధికారిని నోడల్‌ అధికారిగా నియమించామన్నారు.స్కూళ్లకు ఇసుక, సిమెంట్‌, ఐరన్‌ తదితర  మెటీరియల్స్‌ సక్రమంగా సరఫరా చేయడానికి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని చెప్పారు.సమావేశంలో డీఈవో ఎస్‌.అబ్రహం, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బీవీ.ప్రసాద్‌, ఈఈ వై.నరసింహ రావు, ఆర్‌డబ్య్లూఎస్‌ ఎస్‌ఈ బాలశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T06:29:09+05:30 IST