ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-26T05:04:09+05:30 IST

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి : కలెక్టర్‌

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి : కలెక్టర్‌

వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 25: వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ గోపి సూచించారు. ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు ఇక నుంచి చేయమని స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ, విత్తనాల డీలర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ యాసంగిలో వరి చేయొద్దని, ధాన్యం కొనుగోలుపై కేంద్రం విముఖత చూపుతున్నందున పప్పుధాన్యాలు, శనగ, వేరుశనగ, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు, ఆ ముదాలు, కూరగాయలు పండించాలన్నారు. గిరిజన రైతులకు గిరి వికాస పథకంపై అవగాహన కల్పించాలన్నారు. ఐదెకరాలు ఉన్న గిరిజన రైతుల భూమిలో ప్రభుత్వమే పూర్తి సబ్సిడీతో బోరు వేస్తుం దని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ అధికారి ఉషాదయాళ్‌, జి ల్లా ఉధ్యాన వన శాఖ అధికారి శ్రీనివాసరావు, తెలంగాణ సీడ్స్‌ కా ర్పొరేషన్‌ ఆర్‌. రఘు, నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ ఆర్‌ఎం తాంబే పాల్గొన్నారు.



Updated Date - 2021-10-26T05:04:09+05:30 IST