గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్‌కు షాపులు

ABN , First Publish Date - 2022-05-29T06:48:00+05:30 IST

గిరిజన ప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్‌ సౌక ర్యం పెంచడానికి రాజమహేంద్రవరంలో షాపులు ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్‌కు షాపులు
ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారిణి జ్యోతితో కలెక్టర్‌ మాధవీలత

 ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారిణి జ్యోతితో కలెక్టర్‌ మాధవీలత


రాజమహేంద్రవరం, మే 28 (ఆంధ్రజ్యోతి) : గిరిజన ప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్‌ సౌక ర్యం పెంచడానికి రాజమహేంద్రవరంలో షాపులు ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి కెఎన్‌.జ్యోతితో కలిసి గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్‌పై సమీక్షించారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో గిరిజనులు తేనే, చింతపండు, త్రిఫల చూర్ణం, నన్నారి, అలోవిరా జాస్మిన్‌, జ్యూట్‌ బ్యాగ్స్‌, పసుపు, ఉసిరి, శీకాయ, కుంకుడు కాయలు, కాఫీ పొడి తదితర కల్తీ లేని స్వచ్ఛమైన ఉత్పత్తులు సేకరిస్తారన్నారు.దీని వల్ల దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉందని తెలిపారు. ఉత్పత్తులను రాజమహేంద్రవరంలో విక్రయించడానికి రైతు బజార్లు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ వంటి ప్రాంతాల్లో షాపులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. 


Updated Date - 2022-05-29T06:48:00+05:30 IST