సమరయోధుల త్యాగాలు మరువలేనివి

ABN , First Publish Date - 2022-08-12T06:58:38+05:30 IST

స్వాతంత్ర సమరయోఽఽధుల త్యాగాలను స్మరించుకుంటూ ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా పేర్కొన్నారు.

సమరయోధుల త్యాగాలు మరువలేనివి

- కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎస్పీ జాషువా 

- వెయ్యి మీటర్ల జెండాతో విద్యార్థుల భారీ ర్యాలీ 

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 11 : స్వాతంత్ర సమరయోఽఽధుల త్యాగాలను స్మరించుకుంటూ ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం, రవాణా శాఖ సహకారంతో గురువారం మచిలీపట్నం కోనేరుసెంటర్‌ నుంచి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వరకు డిగ్రీ కళాశాల విద్యార్థులతో వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎస్పీ జాషువాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, స్వాతంత్య్ర సముపార్జనకు కృషి చేసిన జాతీయ నాయకులను తలచుకుంటూ ఆజాదీకా అమృత మహోత్సవ్‌ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎస్పీ జాషువా మాట్లాడుతూ, విద్యార్ధులు క్రమశిక్షణతో ఉంటూ జాతీయ నాయకుల చరిత్రలు అధ్యయనం చేయాలన్నారు. ఉపకులపతి ఆచార్య కేబీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, విద్యార్థులు ఆశించిన లక్ష్యసాధనకు, ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రామాంజనేయులు, టౌన్‌ డీఎస్పీ మాసూంబాషా, డీన్‌ సూర్యచంద్రరావు, రామశేఖరరెడ్డి, జయచంద్ర, డాక్టర్‌ ఉష, జిల్లా రవాణా శాఖాధికారి సీతాపతిరావు, ఆర్డీవో ఐ.కిషోర్‌, తహసీల్దార్‌ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్ధులు కోనేరుసెంటర్‌ నుంచి పింగళి వెంకయ్య విగ్రహం వరకు ర్యాలీగా వెళ్ళారు. పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

స్వాతంత్య్ర  వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు : జేసీ

 స్వాతంత్య్ర దిన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.  గురువారం ఆయన  పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ను సందర్శించారు.  అవార్డు గ్రహీతలు, విఐపీలకు వేరు వేరుగా సీట్లు కేటాయించాలన్నారు.  స్టాల్స్‌, శకటాలు, ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు. ఆజాదీకా అమృత మహోత్సవ్‌ సందర్భంగా ప్రాంగణమంతా జాతీయ జెండాలతో నిండి పోవా లన్నారు.  జిల్లా సహకార అధికారి సునీల్‌కుమార్‌, ఆర్డీవో ఐ. కిషోర్‌, డివైఈవో సుబ్బారావు, తహసీల్దార్‌ సునీల్‌బాబు, ఏఆర్‌ ఏఎస్పీ, ఏఆర్‌ డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T06:58:38+05:30 IST