ప్రజల్లో అప్రమత్తత పెంచండి

ABN , First Publish Date - 2021-12-02T05:36:54+05:30 IST

ప్రపంచ వ్యా ప్తంగా పలు దేశాల్లో ఒమైక్రాన్‌ కేసులు నమోదవుతు న్న దృష్ట్యా జిల్లా ప్రజల్లో అప్రమత్తత పెంచాలని, కొవిడ్‌-19 నిబంధనలు ప్రజలు పాటించేలా చూడాలని కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు.

ప్రజల్లో అప్రమత్తత పెంచండి

 కలెక్టర్‌ నాగలక్ష్మి  

అనంతపురం విద్య, డిసెంబరు 1: ప్రపంచ వ్యా ప్తంగా పలు దేశాల్లో ఒమైక్రాన్‌ కేసులు నమోదవుతు న్న దృష్ట్యా జిల్లా ప్రజల్లో అప్రమత్తత పెంచాలని, కొవిడ్‌-19 నిబంధనలు ప్రజలు పాటించేలా చూడాలని కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవా రం జడ్పీలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో కొవిడ్‌-19 నోడల్‌ ఆఫీ సర్లతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ మూడో వేవ్‌ కోసం జూన్‌లోనే జిల్లా యంత్రాంగం సిద్ధమై గ్రామాల్లోనే కొవిడ్‌ కేర్‌ సెం టర్లు, మం డల స్థాయి కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసిందన్నారు. పీహె చ్‌సీల స్థాయిలో సిబ్బందిని, కానసనట్రేటర్ల సంఖ్యను పెం చడం వంటి కార్యక్రమాలు చేపట్టామని, వాటిని పునరు ద్ధరించేందకు సిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్‌ను వేగ వం తం చేయడంపై అధికారులు మరింత దృష్టి పెట్టాల న్నా రు.  జిల్ల్లాలో మొదటి డోసు 90శాతం, రెండో డోసు 63 శాతం పూర్తయ్యిందన్నారు. వ్యాక్సిన్‌ నిల్వలు పూర్తిగా వినియోగించాలన్నారు. టెస్టులు నిత్యం ఆరు వేలకు పెంచాలని ఆదేశించారు. ఫీవర్‌ సర్వేను తిరిగి ప్రారంభించాలన్నారు. జేసీ సిరి మాట్లాడుతూ మూడో వేవ్‌పై భయ పడాల్సిన పనిలేదని, జాగ్రత్తలు పాటిస్తే చాలన్నారు. సమావేశంలో ఎస్పీ ఫక్కీరప్ప, హౌసింగ్‌ జేసీ నిషాంతి, ఆసరా జేసీ గంగాధర్‌ గౌడ్‌, డీఎంహెచఓ కామేశ్వర ప్రసాద్‌, ఇతర నోడల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.


పనులు నాణ్యతగా చేపట్టాలి: కలెక్టర్‌

జిల్లాలో  ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు  నాణ్య తగా చేపట్టాలని కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశిం చారు. బుధవారం ఆమె కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో జేసీ సిరితో కలిసి జగనన్న స్వచ్ఛ సంకల్పం, ఉపాధిహామీ కింద నిర్మిస్తున్న భవనాలు, ఉపాధి పనులు, అవెన్యూ, హార్టికల్చర్‌ ప్లాంటేషన తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, పీ ఆర్‌ ఎస్‌ఈలు, ఉపాధిహామీ ఏపీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సం కల్పం కార్యక్రమం అనేది దీర్ఘకాలిక వ్యవస్థని, దీని కింద చేపడుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం శాశ్వతంగా నిలిచేలా పనిచేయాలన్నారు. ఉపాధి పనుల కల్పనపై ఎలాంటి నిర్లక్ష్యం వద్దన్నారు.  సమావేశంలో జడ్పీ సీఈఓ భాస్కర్‌ రెడ్డి, పీఆర్‌ ఎస్‌ ఈ భాగ్యరాజ్‌, డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, డీఎల్‌పీఓ బా లాజీ, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, పీఆర్‌ ఎస్‌ఈలు, ఉపాధిహామీ ఏపీఓలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T05:36:54+05:30 IST