ప్లాస్లిక్‌ వాడకాన్ని తగ్గించాలి

ABN , First Publish Date - 2022-06-25T05:32:30+05:30 IST

ప్లాస్లిక్‌ వాడకాన్ని తగ్గించాలి

ప్లాస్లిక్‌ వాడకాన్ని తగ్గించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు

 కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, గోపి 

హనుమకొండ రూరల్‌, జూన్‌ 24: ప్లాస్టిక్‌ రహిత జిల్లాలుగా తీర్చిదిద్దడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్‌లు రాజీవ్‌గాంధీ హనుమంతు, గోపి కోరారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిక్షణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్‌కు పూర్తిస్థాయిలో స్వస్తి పలకాలన్నారు. ప్రస్తుతం దుకాణాల్లో లభ్యమయ్యే 50 మైక్రాన్ల మందంకన్నా తక్కువగల ప్లాస్టిక్‌ బ్యాగులను వెంటనే గుర్తించి తొలగించాలని డీపీవో, మునిసిపల్‌ కమిషనర్లకు సూచించారు. ప్రత్యామ్నాయంగా జ్యూట్‌, కాటన్‌, నాన్‌ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌ బ్యాగులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జూలై 1వ తేదీ నుంచి నిషేదించబడిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు వాడిన వ్యక్తులకు, సంస్థలకు  రూ.500నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించాలన్నారు. పాఠశాలల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. 

వరంగల్‌ కలెక్టర్‌ గోపి మాట్లాడుతూ.. వరంగల్‌ జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు, నగర పాలకసంస్థ పరిధిలో ప్లాస్టిక వాడకాన్ని తగ్గించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా, గ్రామాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని పంచాయతీ సెక్రటరీలు, సంబంధిత శాఖల సిబ్బంది అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముందుగా ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి ఎలా రీసైక్లింగ్‌ చేయాలనే అంశంపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకట్‌రాం నర్సయ్య, వరంగల్‌ అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌, జడ్పీ సీఈవో వెంకటేశ్వర్‌రావు, డీఆర్‌డీవోలు ఎ.శ్రీనివా్‌సకుమార్‌, సంపత్‌రావు, డీపీవోలు జగదీశ్వర్‌, స్వరూప, పర్యావరణవేత్తలు, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T05:32:30+05:30 IST