ప్రతి చిన్నారికి అండగా నిలిచేందుకు చర్యలు..

ABN , First Publish Date - 2021-12-02T05:30:00+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఏర్పడిన లోటు ఎవరూ పూడ్చలేనిదని, అయితే ప్రతి చిన్నారికి అండగా నిలిచేందుకు ప్రభుత ్వం ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

ప్రతి చిన్నారికి అండగా నిలిచేందుకు చర్యలు..
కార్యక్రమంలో కలెక్టర్‌

కలెక్టర్‌ హరికిరణ్‌
కాకినాడ సిటీ, డిసెంబరు 2: కొవిడ్‌ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఏర్పడిన లోటు ఎవరూ పూడ్చలేనిదని, అయితే ప్రతి చిన్నారికి అండగా నిలిచేందుకు ప్రభుత ్వం ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో నిర్వహించారు. 40 మంది చిన్నారులకు సంబంధించిన 29 కుటుంబాలతో మహిళాభివృద్ధి, శిశు సంరక్షణ, విద్య, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల జిల్లా అధికారులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్వయంగా మాట్లాడి వారి ఇబ్బందులు, అవసరాలను ప్రత్యేక ఫార్మెట్లలో నమోదు చేశారు. వీటిని కలెక్టర్‌ హరికిరణ్‌, జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి పరిశీలించి ప్రతి అంశంపైన తీసుకోవాల్సిన చర్యలను ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, ఐసీడీఎస్‌ పీడీ జీవీ సత్యవేణి, జిల్లా శిశు సంరక్షణ అధికారి సీహెచ్‌ వెంకట్‌, డీఎంహెచ్‌వో కేవీఎస్‌ గౌరీశ్వరరరావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె.రంగలక్ష్మీదేవి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌వీఎస్‌ సుబ్బలక్ష్మి, డీఈవో ఎస్‌.అబ్రహాం, వికాస పీడీ కె.లచ్చారావు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గిన్నారు.

Updated Date - 2021-12-02T05:30:00+05:30 IST