పని విషయంలో రాజీ లేదు

ABN , First Publish Date - 2022-01-29T06:08:15+05:30 IST

‘అధికారులు చేయాల్సిన పని విషయంలో రాజీ పడేది లేదు. నిర్దేశిత సమయంలోగా నాణ్యతగా పని చేయాల్సిందే’ అని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ స్పష్టం చేశారు.

పని విషయంలో రాజీ లేదు
జంగారెడ్డిగూడెం జగనన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్‌ చేయాలి

అధికారుల సమీక్షలో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌


ఏలూరు/జంగారెడ్డిగూడెం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ‘అధికారులు చేయాల్సిన పని విషయంలో రాజీ పడేది లేదు. నిర్దేశిత సమయంలోగా నాణ్యతగా పని చేయాల్సిందే’ అని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పలు శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగుల పని విష యంలో ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలి. ప్రతిశాఖకు సంబంధించి 15 రోజులకొకసారి సమీక్ష ఉంటుం ది. ‘స్పందన’ దరఖాస్తులు నిర్ణీత సమయంలోగా పరిష్కరిం చాలి. జిల్లాస్థాయి కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి దరఖాస్తు దారులకు ఫోన్‌ చేసి సమస్యపై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. రీ ఓపెన్‌ చేసిన దరఖాస్తులు కచ్చితంగా హెచ్‌వోడీ విచారణ చేసి నివేదికలు ఇవ్వాలి. అలాగే మాస్కు ధరించని వారిపై జరిమానా విధించాలి. వారంలో రెండుసార్లు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రతి ఒక్కరూ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్‌ నిర్వహించి ఫైల్స్‌ ఎప్పటికప్పుడు క్లియర్‌ చేయాలి. ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఈ–ఆఫీస్‌ ఇన్‌బాక్స్‌ స్ర్కీన్‌షాట్‌ తీసి జిల్లా అధికారులు వాట్సాప్‌ గ్రూప్‌ లో పెట్టాలి. శాఖల మధ్య సమస్యలను తొలగించడానికి కన్వర్జెన్స్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తా. జిల్లాలో జాబ్‌ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. పోటీ పరీక్ష లకు హాజరయ్యే వారికి శిక్షణ ఏర్పాటు చేయాలి. వీధి చివర వాహనం నిలిపి అందరినీ అక్కడ నిలబెట్టి బియ్యం ఇచ్చే వారిపై చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు. జేసీ బీఆర్‌ అంబేడ్కర్‌, డీఆర్వో డేవిడ్‌రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నా రు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్‌ శుక్రవారం జంగారెడ్డిగూడెం, కేఆర్‌పురంలలో ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో సచివాలయాల రికార్డులను పరిశీలిం చారు. మార్కండేయపురంలోని టిడ్కో ఇళ్లను, జగనన్న లే అవుట్‌ స్థలాలను పరిశీలించారు. జిల్లాలో 1100 లేఅవుట్‌ లలో 1.10 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణలను చేపట్టినట్టు తెలిపారు.  


Updated Date - 2022-01-29T06:08:15+05:30 IST