పోడు భూముల సర్వేపై కలెక్టర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2022-10-08T05:28:38+05:30 IST

జిల్లాలో పోడు వ్యవసాయ భూముల సర్వే పారదర్శకంగా, వివాదాలకు తావివ్వకుండా నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

పోడు భూముల సర్వేపై కలెక్టర్‌ సమీక్ష
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ

పెద్దపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పోడు వ్యవసాయ భూముల సర్వే పారదర్శకంగా, వివాదాలకు తావివ్వకుండా నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఎస్‌ సంగీతసత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 10 మండలాల్లోని సం బంధిత గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి స్వీకరించిన 4715 పోడు భూముల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేపట్టాలని సూచించారు. సర్వే నిర్వహణ సమయంలో సంబంఽధిత అధికారులు తప్పనిసరిగా తమ వెంట చెక్‌ లిస్ట్‌ తీసుకువెళ్ళాలని, నమునా ఫారంలో పూర్తిస్తాయి వివరాలను నింపాలని అన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ యాప్‌లో సర్వేకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని పోడు వ్యవసాయ భూముల సర్వే క్షేత్రస్థాయిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిం చాలని వివాదాలకు తావివ్వకుండా పారదర్శకంగా చేపట్టాలన్నారు. అర్హత, అనర్హత అంశాలను సర్వేలో వెల్లడించకూడదని పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌సీ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం పూర్తి సాక్ష్యాధా రాలతో మాత్రమే అర్హత, అనర్హత వెల్లడించాల్సి ఉంటుందని, దీనికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు పోడు భూముల సర్వేపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. పెద్దపల్లి జిల్లాలో 487మంది గిరిజనుల నుంచి 931 ఎకరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని, 4228 మంది గిరిజనేతరుల నుంచి 7373 ఎకరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. రెవెన్యూ, పంచాయ తీరాజ్‌, అటవీశాఖలు సమన్వయంతో గ్రామ స్థాయిలో పర్యటించి 2005కు ముందు నుంచి అన్యాక్రాంతం అయిన పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులు, మూడు తరాల నుంచి సాగు చేస్తున్న గిరిజనేత రుల దరఖాస్తులు గ్రామస్థాయి కమిటీలో వారి సమక్షంలో సర్వే చేపట్టాలని, ఆయా స్థాయి కమిటీలో తీర్మానాలను రిజిస్టర్లను పకడ్బం దీగా నమోదు చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారు లతో ఎంపీడీవో సమన్వయం చేసుకుని నిర్దేశించిన నమూనా ప్రకారం డిజిటల్‌ సర్వే నిర్వహించి గ్రామాల నుంచి తీర్మాణాలు పంపా లని సూచించారు. అర్హత కలిగిన గిరిజనులకు, గిరిజనేతరులకు ఆర్‌వో ఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయా లనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భవిష్యత్‌ ఇంచు అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా అడవుల పునర్జీవనానికి పటిష్ట చర్య లు చేపట్టాలని, అటవీ రక్షణ చట్టంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.  పోడు భూముల సర్వే సమాచారం ముందస్తుగా దర ఖాస్తు దారులకు అందజేయాలని, వారి సమక్షంలో భూమిపై జీపీఎస్‌ మ్యాప్‌ వినియోగిస్తూ 7, 8 చోట్ల జియో కోఆర్డినేట్స్‌ నమోదు చేయా లని, వాటితో పాలిగన్‌ డ్రాచేయాలని, ఆమ్యాప్‌ ఫోటో, భూ విస్తీర్ణం వివరాలు దరఖాస్తుదారుని కుటుంబ ఫోటో, 2 ప్రభుత్వ గుర్తింపు కార్డు లు యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య, జిల్లా గిరిజన అభివృ ద్ధి అధికారిణి నీలిమ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T05:28:38+05:30 IST