ధరణి పోర్టల్‌పై కలెక్టర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-01-17T05:48:46+05:30 IST

ధరణి పోర్టల్‌పై కలెక్టర్‌ హన్మంతరావు శనివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో తహసీల్దార్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ధరణి పోర్టల్‌పై కలెక్టర్‌ సమీక్ష
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హన్మంతరావు

సంగారెడ్డి రూరల్‌, జనవరి 16: ధరణి పోర్టల్‌పై కలెక్టర్‌ హన్మంతరావు శనివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో తహసీల్దార్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ధరణికి సంబంధించిన వివిధ అంశాలపై జిల్లాలోని అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీఆర్వో రాధికా రమణి, ఆర్డీవోలు అంబాదాస్‌, రమే్‌షబాబు, విక్టర్‌, నగే్‌షగౌడ్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు.


 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్‌

 జిల్లాను విద్యాభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్‌ హన్మంతరావు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను శనివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఆవిష్కరించి మాట్లాడారు.


మాచనూర్‌ సర్పంచ్‌, ఇంద్రేశం కార్యదర్శి తొలగింపు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) సంగారెడ్డి,  జనవరి 16: ఝరాసంగం మండలం మాచనూర్‌ సర్పంచ్‌ను, పటాన్‌చెరు మండలం ఇంద్రేశం పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ ఎం.హన్మంతరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మాచనూర్‌ సర్పంచ్‌ జె.రాజు పంచాయతీకి సంబంధించి రూ. లక్షా 40 వేలను దుర్వినియోగం చేసినట్టు తేలడంతో ఆయనను ఆరు నెలల పాటు విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులివ్వడంతో పాటు ఉప సర్పంచ్‌కు కూడా షోకాజ్‌ నోటీసులిచ్చారు. అలాగే పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో అక్రమ కట్డడాలను అడ్డుకోక పోవడంతో పంచాయతీ కార్యదర్శి ఎ.మహే్‌షను విధుల నుంచి తొలగించారు. అంతేగాక అక్కడి గ్రామ పంచాయతీ పాలకవర్గానికి షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-17T05:48:46+05:30 IST