కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-08-07T06:35:33+05:30 IST

కరోనా నివారణ చర్యలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహి ంచాలని కలెక్టర్‌ శరత్‌ జిల్లా వైద్యాఽధికారులను

కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహించాలి

కలెక్టర్‌ శరత్‌


కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 6: కరోనా నివారణ చర్యలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిoచాలని కలెక్టర్‌ శరత్‌ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో జిల్లా వైద్యఆరోగ్యశాఖ రూపొం దించిన కరోనా జ్వరం, సీజనల్‌ జ్వరానికి గల లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసే బ్రోచర్‌లను, పోస్టర్స్‌ ను కలెక్టర్‌ విడుదల చేశారు.


ప్రస్తుతం అంటువ్యాధులు ప్రబలే కాలం కాబట్టి, ఈ కాలంలో వచ్చే వ్యాధి లక్షణాలపై ప్రచార సామగ్రి ద్వారా ప్రచారం కల్పించాలని, కరోనా జ్వరానికి, సీజన ల్‌ జ్వరానికి గల తేడా లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామీణ స్థాయిలో ప్రచారం కల్పించాలని తెలిపారు. జిల్లా కరోనా హెల్ప్‌లైన్‌ కంట్రోల్‌ రూం నెంబర్లు 7382928649, 7382929350 లను గ్రామాలలో, పట్టణాలలో తెలిసే విధంగా ప్రచార సామగ్రి రూపొందించి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. అంతేకాకుండా కామారెడ్డి పట్టణంలో ఆయా వార్డులలో వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది కరోనా వైరస్‌, సీజనల్‌ వ్యాధుల మధ్య తేడాను వివరించారు. 

Updated Date - 2020-08-07T06:35:33+05:30 IST